Telugu Global
National

ఉద్దవ్ ఠాక్రేకు హ్యాండ్ ఇవ్వనున్న సంజయ్ రౌత్ ?

శివసేన ఉద్దవ్ వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్, ఉద్దవ్ కు హ్యాండిచ్చి ఎన్‌సిపిలో చేరతారని బీజేపీ నేత నితీష్ రాణే షాకింగ్ ప్రకటన చేశారు.

ఉద్దవ్ ఠాక్రేకు హ్యాండ్ ఇవ్వనున్న సంజయ్ రౌత్ ?
X

శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి రాజీనామా చేసి అనంతరం నాయకులు, కార్యకర్తల ఒత్తిడితో రాజీనామా ఉపసంహరించుకున్న ఘటన జరిగిన‌ ఒక్క రోజులోనే మరో బాంబు పేల్చింది బీజేపీ. ఎన్‌సిపిని అజిత్ పవార్ వీడుతారని, అనంతరం శివసేన ఉద్దవ్ వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్, ఉద్దవ్ కు హ్యాండిచ్చి ఎన్‌సిపిలో చేరతారని బీజేపీ నేత నితీష్ రాణే షాకింగ్ ప్రకటన చేశారు.

అసలు ఉద్ధవ్, రాజ్ ఠాక్రే ల మధ్య విభేదాలు సృష్టించిందే సంజయ్ రౌత్ అని నితేష్ రాణే ఆరోపించారు.

జూన్ 10 లోపు సంజయ్ రౌత్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని, నేను కచ్చితంగా చెబుతున్నాను, ఆయన అందుకు సంబంధించిన అన్ని సన్నాహాలు చేస్తున్నార‌ని నితీష్ రాణే అన్నారు.

శరద్ పవార్ తో సంజయ్ రౌత్ చర్చలు కూడా జరిపారని, అయితే సంజయ్ రౌత్ ఎన్‌సిపిలో చేరడానికి కొన్ని షరతులు ఉన్నాయన్న రాణే,, అజిత్ పవార్ పార్టీ నుంచి వెళ్లిపోయిన‌ వెంటనే రౌత్ ఎన్‌సిపిలో చేరతారని నితేష్ అన్నారు.

సంజయ్ రౌత్ తన భవిష్యత్తు గురించి భయపడుతున్నారని, ఉద్దవ్ తనను మళ్ళీ ఎంపీగా చేయలేరని ఆయన నమ్ముతున్నారని అందుకే ఎన్‌సిపి వైపు అడుగులు వేస్తున్నారని రాణే తెలిపారు.

First Published:  7 May 2023 1:00 PM GMT
Next Story