Telugu Global
National

'రోహింగ్యాలు చట్టవిరుద్ధ విదేశీయులు.... హోంమంత్రిత్వ శాఖ ప్రకటన‌

రోహింగ్యాలు చట్టవిరుద్దంగా ఈ దేశంలోకి ప్రవేశించిన విదేశీయులని, వారికి వసతి, రక్షణ కల్పించే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. రోహింగ్యాలకు వసతి (ఫ్లాట్లు), రక్షణ కల్పిస్తామని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించిన కొద్ది సేపటికే హోం శాఖ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

రోహింగ్యాలు చట్టవిరుద్ధ విదేశీయులు.... హోంమంత్రిత్వ శాఖ ప్రకటన‌
X

1100 మంది రోహింగ్యాలకు వసతి (ఫ్లాట్లు), రక్షణ కల్పిస్తామని హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటనను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. వాళ్ళంతా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన విదేశీయులని కేంద్రం పేర్కొంది.

రోహింగ్యాలు మన దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులు. ఇలా అక్ర‌మంగా ప్ర‌వేశించిన వారికి ఢిల్లీలో ఈడ‌బ్ల్యుఎస్ ఫ్లాట్లు ఇవ్వబోమని హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. "రోహింగ్యాలను కొత్త ప్రదేశానికి తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. చట్టప్రకారం అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన విదేశీయులను బహిష్కరించే వరకు డిటెన్షన్ సెంటర్‌లో ఉంచాలి" అని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

రోహింగ్యా అక్రమ వలసదారులకు ఈడ‌బ్ల్యుఎస్ ఫ్లాట్లను అందించడానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని హోం మంత్రిత్వ శాఖ బుధ‌వారంనాడు (ఆగస్టు 17న) పేర్కొంది. "రోహింగ్యాలను కొత్త ప్రదేశానికి తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. రోహింగ్యాలు కంచన్ కుంజ్, మదన్‌పూర్ ఖాదర్‌లోని ప్రస్తుత ప్రదేశంలో కొనసాగేలా చూడాలని హోం శాఖ ఇఎన్సిటిడిని ఆదేశించింది, ఈ అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను వారి దేశానికి తిరిగి పంపేందుకు ఇప్పటికే విదేశీవ్య‌వ‌హారాల శాఖ ద్వారా సంబంధిత దేశంతో సంప్ర‌దింపులు చేపట్టింది", అని హోం శాఖ ట్వీట్ చేసింది.

చట్టప్రకారం అక్రమంగాప్ర‌వేశించిన విదేశీయులను తిప్పి పంపే వ‌ర‌కు వరకు డిటెన్షన్ సెంటర్లలోనే ఉంచాలని పేర్కొంది. "ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుత ప్రదేశాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించలేదు. వెంటనే ఆ పని చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశాము" అని పేర్కొంది.

రోహింగ్యాలను ఈడ‌బ్ల్యుఎస్ ఫ్లాట్‌లకు తరలించి వారికి శరణార్థి కార్డులు ఇస్తున్నారనే వాదనలు నిజం కాదని కేంద్ర హోం శాఖ ఉద్ఘాటించింది. రోహింగ్యాలు భారతదేశంలో అక్రమంగా ఉంటున్న 'అక్రమ విదేశీయులు' అని, వారిని బహిష్కరిస్తామని, శరణార్థి హోదా ఇవ్వబోమని స్పష్టం చేసింది.

1100 మంది రోహింగ్యా అక్రమ విదేశీయులందరికీ వసతి (ఫ్లాట్లు), రక్షణ కల్పిస్తామని కేంద్ర‌ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్య‌వ‌ధిలోనే కేంద్ర హోం శాఖ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

"దేశంలో ఆశ్రయం పొందిన వారిని భారతదేశం ఎల్లప్పుడూ స్వాగతించింది. రోహింగ్యా శరణార్థులందరినీ ఢిల్లీలోని బక్కర్‌వాలా ప్రాంతంలోని ఈడ‌బ్ల్యుఎస్‌ ఫ్లాట్‌లకు తరలించనున్నారు. వారికి ప్రాథమిక సౌకర్యాలు, యుఎన్‌హెచ్‌సిఆర్ ఐడిలు (గుర్తింపు కార్డులు), 24 గంటల పాటు ఢిల్లీ పోలీసు రక్షణ కల్పిస్తారు" అని పూరీ ట్వీట్ చేశారు.

ఇంతకుముందు, రోహింగ్యా ముస్లింలను అక్రమ వలసదారులుగా పరిగణించి వారిని శరణార్థులుగా గుర్తించాల‌నే ఆలోచనతో ఉన్న‌ట్టు, భారతదేశం యుఎన్ రిఫ్యూజీ క‌న్వెన్ష‌న్ 1951 ని అనుసరిస్తుందని,అందరికీ ఆశ్రయం కల్పిస్తుందని మంత్రి హర్దీప్ పూరి చెప్పారు. అయితే ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్‌పై భారతదేశం సంతకం చేయలేదని, అందువల్ల శరణార్థి కార్డును కలిగి ఉన్నప్పటికీ, ఏ వ‌ర్గాన్నీ "శరణార్థులు"గా పరిగణించాల్సిన బాధ్యత భారతదేశానికి లేదని హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరో వైపు... కేంద్ర మంత్రి హర్దీప్ పూరి చేసిన ప్రకటనను తమపై నెట్టివేయడానికి కేంద్రం ప్రయత్నించడం పట్ల ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. రోహింగ్యాలకు వసతి కల్పిస్తామని తాము ఎన్నడూ చెప్పలేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.

First Published:  17 Aug 2022 3:33 PM GMT
Next Story