Telugu Global
National

ప్ర‌శాంత్ కిశోర్‌పై రాబిన్ శ‌ర్మ పైచేయి సాధించాడా?

మొత్తానికి ప్ర‌శాంత్ కిశోర్ ద‌గ్గ‌ర రాజ‌కీయ వ్యూహాల పాఠాలు నేర్చుకున్న రాబిన్ శ‌ర్మ మేఘాల‌య ఫ‌లితాల‌తో గురువు ఎదుటే త‌న స‌త్తా చాటిన‌ట్ట‌య్యింది. వాస్త‌వంగా మేఘాల‌య ఎన్నిక‌ల్లో ఎన్‌పీపీ విజ‌యం సాధించిన వెంట‌నే రాబిన్ శ‌ర్మ శుభాకాంక్ష‌లు ట్వీట్ వేయ‌డంతో ఆయ‌న‌ టీం అక్క‌డ ప‌నిచేసింద‌ని అంద‌రికీ తెలిసింది.

ప్ర‌శాంత్ కిశోర్‌పై రాబిన్ శ‌ర్మ పైచేయి సాధించాడా?
X

ప్ర‌శాంత్ కిశోర్.. దేశ‌వ్యాప్తంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. రాజ‌కీయ వ్యూహాల‌కు పెట్టింది పేరు. దేశంలో చిన్నా లేదు, పెద్దా లేదు. ప్ర‌తీ రాజ‌కీయ పార్టీ ఎవ‌రో ఒక వ్యూహ‌క‌ర్త‌ని ఆశ్ర‌యిస్తోంది. ఇదంతా ప్ర‌శాంత్ కిశోర్ చ‌ల‌వ‌. ఇండియ‌న్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ షార్ట్‌గా చెప్పాలంటే ఐప్యాక్‌. ఈ సంస్థ ఇప్పుడు దేశ రాజ‌కీయాల‌లో పెను సంచ‌ల‌నం. ఐప్యాక్ ప్ర‌శాంత్ కిశోర్ బృందం ఇప్ప‌టికే వైసీపీ, డీఎంకే, టీఎంసీ గెలుపు కోసం ప‌నిచేసి త‌న స‌త్తా చాటారు. ఇత‌ర పార్టీలు కూడా ఐప్యాక్‌ని పొలిటిక‌ల్ క‌న్స‌ల్టెన్సీగా నియ‌మించుకుంటున్నారు.

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల‌కి డిమాండ్ పెర‌గ‌డంతో ప్ర‌శాంత్ కిశోర్ బృందంలో కీల‌క స్థానాల‌లో ప‌నిచేసి బ‌య‌ట‌కొచ్చి సొంతంగా క‌న్స‌ల్టెన్సీలు పెట్టుకున్నారు. వీరిలో రాబిన్ శ‌ర్మ ఒక‌రు. ప్ర‌శాంత్ కిశోర్ గురువు అయితే రాబిన్ శ‌ర్మ‌ని శిష్యుడు అని అంటారు. ఇప్పుడు ఈ గురుశిష్యుల‌లో రాజ‌కీయ వ్యూహాల‌లో శిష్యుడు పైచేయి సాధించాడు.




ఐప్యాక్ ప్ర‌శాంత్ కిశోర్ టీమ్ ఏపీలో వైసీపీ కోసం చేస్తుండ‌గా, రాబిన్ శ‌ర్మ షోటైమ్ ఇండియా సంస్థ టిడిపి క‌న్స‌ల్టెంట్‌గా కుదురుకుంది. ఇక్క‌డ ఇద్ద‌రి వ్యూహ‌, ప్ర‌తివ్యూహాలు కొన‌సాగుతున్నాయి. గురుశిష్యులిద్ద‌రూ మేఘాల‌యలోనూ రెండు పార్టీల‌కు క‌న్స‌ల్టెంట్లుగా ప‌నిచేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. మేఘాల‌య ఎన్‌పీపీ కోసం రాబిన్ శ‌ర్మ ప‌నిచేశారు. అతి ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా ఎన్‌పీపీ నిలిచింది. పూర్తి మెజారిటీకి కాస్త దూరంలో నిలిచిన ఎన్‌పీపీ బీజేపీ స‌హ‌కారంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. ఎన్‌పీపీ కోసం రాబిన్ శ‌ర్మ టీం మొత్తం ప‌నిచేసింది. టీఎంసీ కోసం ఐప్యాక్ ప్రశాంత్ కిశోర్ బృందం వ‌ర్క్ చేసింది. టీఎంసీ 5 సీట్లే సాధించ‌గా, ఎన్‌పీపీ 27 సీట్ల‌లో ఘ‌న‌విజ‌యం సాధించింది. మొత్తానికి ప్ర‌శాంత్ కిశోర్ ద‌గ్గ‌ర రాజ‌కీయ వ్యూహాల పాఠాలు నేర్చుకున్న రాబిన్ శ‌ర్మ మేఘాల‌య ఫ‌లితాల‌తో గురువు ఎదుటే త‌న స‌త్తా చాటిన‌ట్ట‌య్యింది. వాస్త‌వంగా మేఘాల‌య ఎన్నిక‌ల్లో ఎన్‌పీపీ విజ‌యం సాధించిన వెంట‌నే రాబిన్ శ‌ర్మ శుభాకాంక్ష‌లు ట్వీట్ వేయ‌డంతో ఆయ‌న‌ టీం అక్క‌డ ప‌నిచేసింద‌ని అంద‌రికీ తెలిసింది.

First Published:  2 March 2023 4:22 PM GMT
Next Story