Telugu Global
National

యువకుడిని రేప్ చేసి, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి..

పుత్తానందంను కొలను వద్దకు తీసుకెళ్లి బట్టలు ఊడదీశాడు. అతడిపై రేప్ అటెంప్ట్ చేశాడు. అసహజ శృంగారానికి ప్రయత్నించాడు.

యువకుడిని రేప్ చేసి, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి..
X

యువకుడిపై లైంగిక దాడి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఆ దాడికి పాల్పడింది కూడా మరికొందరు యువకులే కావడం మరో విశేషం. అంతే కాదు.. లైంగిక దాడి చేసే సమయంలో సెల్ ఫోన్ లో వీడియో కూడా రికార్డ్ చేసి వికృత ఆనందం పొందారు ఆ శాడిస్ట్ లు. ఆ తర్వాత వీడియోని సోషల్ మీడియాలో పెడతామంటూ బాధితుడిని బ్లాక్ మెయిల్ చేశారు. 75వేల రూపాయలు ఫోన్ పే చేయించుకున్నారు. చివరకు బాధితుడు ధైర్యం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటపడింది. మగాళ్లపై వికృత చేష్టలకు పాల్పడుతున్న ఆ గ్యాంగ్ ని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మణప్పారైకు చెందిన పుత్తానందం అనే ఐటీ ఉద్యోగి ప్రతిరోజూ సిటీ బస్సులో ఉద్యోగానికి వెళ్లి వస్తుంటాడు. ఇటీవల బస్సులో అరివళగన్‌ అనే యువకుడితో గొడవ మొదలైంది. అరివళగన్ వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారంతా బైక్ లలో ఆ బస్సుని వెంబడించారు. మణప్పారై దగ్గర్లో ఓ కొలను వద్ద బస్సుని ఆపి పుత్తానందంను బలవంతంగా కిందకు దించారు.

తమ ఫ్రెండ్ తో ఎందుకు గొడవపడ్డావంటూ పుత్తానందంను నిలదీశారు. అక్కడితో ఆ గొడవ సద్దుమణిగి ఉంటే సరిపోయేది. కానీ అందులో రియాజ్ అనే శాడిస్ట్ ఉన్నాడు. పుత్తానందంను కొలను వద్దకు తీసుకెళ్లి బట్టలు ఊడదీశాడు. అతడిపై రేప్ అటెంప్ట్ చేశాడు. అసహజ శృంగారానికి ప్రయత్నించాడు. మిగతా మిత్రులు ఆ తతంగాన్ని సెల్ ఫోన్ లో బంధించారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని పుత్తానందంను బెదిరించారు. రూ.75 వేలు డబ్బులు డిమాండ్ చేశారు. చేసేదేం లేక పరువు పోతుందనే భయంతో పుత్తానందం వారు అడిగిన డబ్బుని ఫోన్ పే చేశాడు.

ఆ తర్వాత బాధితుడు ధైర్యం తెచ్చుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా వారిలో కొంతమంది ఓ బాలికను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలున్నాయి. యువకుడిపై జరిగిన లైంగిక దాడి తమిళనాడులో కలకలం రేపింది.

First Published:  21 April 2023 4:52 AM GMT
Next Story