Telugu Global
National

బీజేపీ కార్యకర్తల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి 15 కి.మీ. పరిగెత్తి అడువుల్లో తలదాచుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

''రాత్రి 9.30 గంటలకు నాపై బిజెపి అభ్యర్థి. అతని 150 మంది గూండాలు కత్తులతో దాడి చేశారు. వారు నన్ను చంపి ఉండేవాళ్ళు. నేను పరిగెత్తి మూడు-నాలుగు గంటల పాటు అడవిలో దాక్కున్నాను. ఆ తర్వాత పోలీసులు నన్ను కనుగొన్నారు." అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖరాడీ చెప్పారు.

బీజేపీ కార్యకర్తల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి 15 కి.మీ. పరిగెత్తి అడువుల్లో తలదాచుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
X

గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే , బనస్కాంత జిల్లా దంతా అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కాంతి ఖరాడిపై దాడి జరిగింది. తనపై తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లడ్డూ పర్ఘీ అతని అనుచరులు దాడి చేశారని, తనను హత్య చేయడానికి ప్రయత్నించారని కాంతి ఖరాడి ఆరోపించారు.

తమ అభ్యర్థి కాంతి ఖరాడీ అదృశ్యమయ్యాడంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన ఒక రోజు తర్వాత కాంతి ఖరాడీ మీడియా ముందుకు వచ్చారు. తాను ముందు రోజు రాత్రంతా అడవిలో దాక్కున్నానని చెప్పారు.

తాను ఓటర్ల వద్దకు వెళుతున్న సమయంలో బీజేపీ అభ్యర్థి, అతని గూండాలు తన కారును అడ్డుకుని చుట్టుముట్టారని ఆరోపించారు.

"వారు మా కారును అడ్డుకున్నారు, దాంతో మేము కారును వెనక్కి తిప్పాము, దాంతో అటు వైపు నుండి మరో కారును మా కారుకు అడ్డుగా తీసుకొచ్చి ఆపారు. ఇక మా కారు ఎటూ కదల లేని పరిస్థితుల్లో మేము కారు వదిలి పరుగెత్తాము. ఆ గూండాల నుండి తప్పించుకోవడానికి మేము 10-15 కిమీ వరకు పరిగెత్తాము" అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు.

"రాత్రి 9.30 గంటలకు నాపై బిజెపి అభ్యర్థి. అతని 150 మంది గూండాలు కత్తులతో దాడి చేశారు. వారు నన్ను చంపి ఉండేవాళ్ళు. నేను పరిగెత్తి మూడు-నాలుగు గంటల పాటు అడవిలో దాక్కున్నాను. ఆ తర్వాత పోలీసులు నన్ను కనుగొన్నారు." అని ఖరాడీ NDTVకి చెప్పారు.

గతంలో కూడా బీజేపీ అభ్యర్థి తనను బెదిరించారని, తనకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ ను తాను అభ్యర్థించినప్పటికీ వారు తిరస్కరించారని ఆయన పేర్కొన్నారు.

దానికి ముందు రాహుల్ గాంధీ ఓ ట్వీట్ లో, "కాంగ్రెస్ గిరిజన నాయకుడు, దంతా అసెంబ్లీ అభ్యర్థి కాంతిభాయ్ ఖరాడిపై బిజెపి గూండాలు దారుణంగా దాడి చేశారు. ఇప్పుడుఅతను అదృశ్యమయ్యారు. ఎన్నికల కమిషన్‌తో పాటు పారామిలటరీ బలగాలను మోహరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది, కానీ కమిషన్ నిద్ర నటిస్తోంది. బిజెపి కి మేము భయపడము. గట్టిగా పోరాడతాము, "అని అన్నారు.

తనపై దాడి సంఘటన గురించి కాంతి ఖరాడి పోలీసు స్టేషన్ లో బీజేపీ అభ్యర్థి లడ్డూ పర్ఘీపై పిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలపై బీజేపీ కానీ లడ్డూ పర్ఘీ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

First Published:  5 Dec 2022 11:09 AM GMT
Next Story