Telugu Global
National

రన్వీర్ నగ్న చిత్రాలు చూసే హక్కు మహిళలకు లేదా..?

మహిళలకు ఎక్స్ పోజింగ్ చేసే హక్కు ఉన్నట్టే, పురుషులకు కూడా ఉందని, ఆ పని చేసిన రన్వీర్ ని మెచ్చుకోవాల్సింది పోయి ఇలా కించపరచడం సరికాదంటున్నాడు వర్మ.

రన్వీర్ నగ్న చిత్రాలు చూసే హక్కు మహిళలకు లేదా..?
X

రన్వీర్ సింగ్ నగ్న చిత్రాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్ ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎందుకు వదిలిపెడతాడు చెప్పండి. వరుసగా ఓ పది ట్వీట్లు వేశారు, పనిలో పనిగా సంచలనంగా ఉన్న రన్వీర్ నగ్న చిత్రాలను కూడా తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇక్కడితో ఆగితే వర్మ స్పెషాలిటీ ఏముంది..? అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. రన్వీర్ ని పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆయన నగ్న చిత్రాలను చూసే హక్కు మహిళలకు లేదా అని ప్రశ్నించాడు.

జెండర్ ఈక్వాలిటీ..

ఏళ్ల తరబడి మహిళల నగ్న చిత్రాలను చూస్తూ పురుషులు తృప్తి చెందుతున్నారని, ఆ తృప్తి ఆడవారికి కూడా కలిగించేందుకే రన్వీర్ సింగ్ తన నగ్న దేహాన్ని ఇలా ప్రదర్శనకు పెట్టారని మెచ్చుకున్నాడు వర్మ. మహిళల నగ్న చిత్రాలను పురుషులు ఎలా చూస్తున్నారో.. పురుషుల చిత్రాలను అలా చూసే హక్కు మహిళలకు లేదా అని ప్రశ్నించాడు. లింగ సమానత్వం కోసం పాటుపడుతున్న మహనీయుడు రన్వీర్ అంటూ తనదైన శైలిలో ట్వీట్లు వేశారు.

మహిళలకు ఎక్స్ పోజింగ్ చేసే హక్కు ఉన్నట్టే, పురుషులకు కూడా ఉందని, ఆ పని చేసిన రన్వీర్ ని మెచ్చుకోవాల్సింది పోయి ఇలా కించపరచడం సరికాదంటున్నాడు వర్మ. ఆ విషయంలో ఆయన పురుష హక్కులకోసం పోరాడే మహనీయుడని కూడా అన్నాడు. ఈ విషయంలో రన్వీర్ చాలామందికి ఆదర్శనీయుడయ్యారని, మహిళలు, పురుషులు మరింత నగ్నంగా మారేందుకు మార్గదర్శి అయ్యారని చెప్పారు. మనసులో నగ్నత్నం చూడాలని ఉన్నా.. ఇలాంటి ఫొటోలకు వ్యతిరేకంగా పోరాడేవారంతా చచ్చిపోవాలని మహిళలు, స్వలింగ సంపర్కులు కోరుకోవాలని చెప్పారు వర్మ. అంతే కాదు.. రన్వీర్ నగ్న ఫొటోలను వ్యతిరేకిస్తున్న వారిని, ఆయనపై పోలీస్ కేసులు పెట్టినవారి ఇంటి ముందు మహిళలు ధర్నా చేయాలని కోరారు వర్మ. రన్వీర్ సింగ్ నగ్న చిత్రాలకంటే ఇప్పుడు వర్మ ట్వీట్లే మరింత సంచలనంగా మారాయి.

First Published:  27 July 2022 2:49 AM GMT
Next Story