Telugu Global
National

కుట్రకోణం వట్టిదేనా.. సేఫ్టీ కమిషన్ విచారణ నివేదిక

రాంగ్‌ వైరింగ్‌, రాంగ్‌ కేబుల్‌ వల్ల 2022 మే 16న ఇదే తరహా దుర్ఘటన ఖరగ్‌ పూర్‌ డివిజన్‌ లో జరిగినట్టు గుర్తు చేసింది సేఫ్టీ కమిషన్. అప్పుడే దాన్ని సరిచేసి ఉంటే ఒడిశాలో ఇప్పుడిలా రాంగ్‌ సిగ్నల్ సమస్య వచ్చి ఉండేది కాదని తేల్చింది.

కుట్రకోణం వట్టిదేనా.. సేఫ్టీ కమిషన్ విచారణ నివేదిక
X

ఒడిశా రైలు ప్రమాదంలో కుట్రకోణం ఉందంటూ హడావిడిగా సీబీఐని రంగంలోకి దింపింది కేంద్రం. అప్పటికప్పుడు తప్పుని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ అందులో కుట్రకోణం లేదని ఇప్పుడు తేలిపోయినట్టే. ఎందుకంటే.. రైల్వే సేఫ్టీ కమిషన్ విచారణలో అసలు కారణం రాంగ్ సిగ్నల్ అని తేలింది. ఈ విచారణ నివేదికను రైల్వే సేఫ్టీ కమిషన్ తాజాగా రైల్వే బోర్డుకి సమర్పించింది.

జూన్ -2న ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి కారణం రాంగ్‌ సిగ్నల్ గా తేల్చింది రైల్వే సేఫ్టీ కమిషన్. రాంగ్ సిగ్నలింగ్ తో అనేక స్థాయిల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించిన రైల్వే సేఫ్టీ కమిషన్‌.. తన దర్యాప్తు నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. గతంలో కూడా ఇదే తరహా తప్పులు జరిగాయని నివేదికలో తెలిపిన కమిషన్, ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని ఉంటే ఈ ప్రమాదం తప్పి ఉండేదని అభిప్రాయపడింది.

గతంలో కూడా..

రాంగ్‌ వైరింగ్‌, రాంగ్‌ కేబుల్‌ వల్ల 2022 మే 16న ఇదే తరహా దుర్ఘటన ఖరగ్‌ పూర్‌ డివిజన్‌ లో జరిగినట్టు గుర్తు చేసింది సేఫ్టీ కమిషన్. అప్పుడే దాన్ని సరిచేసి ఉంటే ఒడిశాలో ఇప్పుడిలా రాంగ్‌ సిగ్నల్ సమస్య వచ్చి ఉండేది కాదని తేల్చింది. సిగ్నలింగ్‌, సర్క్యూట్‌ మార్పులో జరిగిన లోపాలే ఈ ప్రమాదానికి కారణమని తేల్చింది. అంటే రైల్వే బోర్డ్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తేలింది. అంటే రైల్వేలో వ్యవస్థాగతమైన లోపాలను సరిదిద్దడం, సిబ్బంది నియామకంపై దృష్టిపెట్టడం వంటివి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.

First Published:  3 July 2023 4:13 PM GMT
Next Story