Telugu Global
National

రాహుల్ గాంధీ ప్రసంగాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, ఆయన నెహ్రూను గుర్తు చేస్తున్నాడు - ఎమ్ కే స్టాలిన్

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ ప్రశంసించారు. ''రాహుల్ ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. ఆయన ఎన్నికల రాజకీయాలు, పార్టీ రాజకీయాలు కాకుండా భావజాల రాజకీయాలు మాట్లాడుతున్నారు. అందుకే ఆయనను కొందరు వ్యక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.'' అని స్టాలిన్ అన్నారు.

రాహుల్ గాంధీ ప్రసంగాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, ఆయన నెహ్రూను గుర్తు చేస్తున్నాడు - ఎమ్ కే స్టాలిన్
X

రాహుల్ గాంధీ ప్రసంగాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, ఆయన నెహ్రూను గుర్తు చేస్తున్నాడు - ఎమ్ కే స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ జోడో యాత్ర అద్భుతంగా సాగుతుందన్నారు. రాహుల్ ఉపన్యాసాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఎ గోపన్న నెహ్రూపై రచించిన 'మమనితార్ నెహ్రూ' పుస్తకాన్ని స్టాలిన్ చెన్నైలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లౌకికవాదం, సమానత్వం వంటి విలువలను కాపాడేందుకు దేశానికి జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ లాంటి నాయకులు అవసరమని అన్నారు.

నెహ్రూ "నిజమైన ప్రజాస్వామ్యవాది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రతీక. అందుకే అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఆయనను కీర్తించాయి" అని స్టాలిన్ అన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈరోజు పార్లమెంట్‌లో ముఖ్యమైన అంశాలను కూడా చర్చకు అనుమతించడం లేదని ఆరోపించిన స్టాలిన్ నెహ్రూ వ్యతిరేక అభిప్రాయాలను కూడా ప్రోత్సహించారని గుర్తు చేశారు.

" దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడి పోతూ ఉంటే, ఇప్పుడు మనకు నెహ్రూ గుర్తుకు వస్తున్నారు." "నేటి రాజకీయ పరిస్థితులు మనకు నెహ్రూ యొక్క నిజమైన విలువను తెలియజేస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా భారతదేశానికి సమాఖ్య, సమానత్వం, లౌకికవాదాన్ని స్థాపించడానికి గాంధీ, నెహ్రూ అవసరం ఉంది. " అన్నారు స్టాలిన్.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను స్టాలిన్ ప్రశంసించారు. ''రాహుల్ ప్రసంగాలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. ఆయన ఎన్నికల రాజకీయాలు, పార్టీ రాజకీయాలు కాకుండా భావజాల రాజకీయాలు మాట్లాడుతున్నారు. అందుకే ఆయన్ను కొందరు వ్యక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ప్రసంగాలు కొన్నిసార్లు నెహ్రూలా ఉంటాయి.. మహాత్మాగాంధీ, నెహ్రూ వారసులు చేసే చర్చల వల్ల గాడ్సే వారసులకు బాధ‌ కలుగుతుంది'' అని స్టాలిన్ అన్నారు.

నెహ్రూ తమిళనాడుకు ఎంతో చేశారని చెప్పారు స్టాలిన్. ఐఐటీ-మద్రాస్‌, ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌సీ) ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ రోజు రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం సాగుతోంది. కానీ నెహ్రూ అలాంటి ప్రయత్నాలను ఆనాడే వ్యతిరేకించారని స్టాలిన్ గుర్తు చేశారు.

మహాత్మా గాంధీ స్వయంగా నెహ్రూను ప్రశంసించారని, నెహ్రూ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉందని చెప్పారని స్టాలిన్ అన్నారు.

నెహ్రూ కేవలం కాంగ్రెస్ గొంతును మాత్రమే కాకుండా భారతదేశం యొక్క గొంతును ప్రతిధ్వనించారు, అతను భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రి - అతను ఒకే భాష, ఒకే విశ్వాసం, ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే చట్టానికి వ్యతిరేకం.. మతతత్వం, జాతీయవాదం కలిసి ఉండవని ఆయన అన్నారు. అందుకే ఆయన లౌకిక శక్తులచే కీర్తించబడ్డారు" అని స్టాలిన్ అన్నారు

కొన్ని సార్లు నెహ్రూ మాదిరి రాహుల్ మాట్లాడుతున్నారని అన్నారు. తమిళనాడుకు నెహ్రూ ఎంతో చేశారని... రాష్ట్రంలో బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయలేదని చెప్పారు. ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. తమిళనాడులో ఐఐటీ మద్రాస్, ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ వంటివి నెహ్రూ వల్లే వచ్చాయని చెప్పారు. నెహ్రూను గాంధీ కూడా ప్రశంసించేవారని... నెహ్రూ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారని చెప్పారు.

First Published:  26 Dec 2022 6:25 AM GMT
Next Story