Telugu Global
National

రాహుల్‌పై అన‌ర్హ‌త ఎత్తివేత‌.. - ప్ర‌క‌టించిన లోక్‌స‌భ స‌చివాల‌యం

2019లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

రాహుల్‌పై అన‌ర్హ‌త ఎత్తివేత‌.. - ప్ర‌క‌టించిన లోక్‌స‌భ స‌చివాల‌యం
X

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీపై వేసిన అన‌ర్హ‌తను ఎత్తివేసిన‌ట్టు లోక్‌స‌భ స‌చివాల‌యం సోమ‌వారం ప్ర‌క‌టించింది. దీంతో రాహుల్‌గాంధీ మ‌ళ్లీ లోక్‌స‌భ‌లో అడుగుపెట్ట‌నున్నారు. 'మోదీ ఇంటి పేరు'పై చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు దిగువస్థాయి కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన‌ట్టు లోక్‌స‌భ స‌చివాల‌యం వెల్ల‌డించింది. ఈ మేరకు సోమ‌వారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాహుల్ సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు మార్గం సుగ‌మ‌మైంది. ఇక ప్రధాని మోదీ సర్కారుపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 8వ తేదీ (మంగళవారం) నుంచి లోక్‌స‌భలో చర్చ జరగనుంది. ఈ చర్చలోనూ రాహుల్ పాల్గొననున్నారు.

2019లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై గుజరాత్‌లో కేసు నమోదు కాగా.. ఈ ఏడాది మార్చి 23న సూరత్ లోని సెషన్స్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే లోక్‌స‌భ సచివాలయం రాహుల్ గాంధీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది.

First Published:  7 Aug 2023 7:54 AM GMT
Next Story