Telugu Global
National

చలికాలంలో ఓన్లీ టీషర్ట్ మీద యాత్ర.. రాహుల్ జీ.. మీకు చలి వేయదా?

ఇంత చలిలో కేవలం టీషర్ట్ వేసుకొని మాత్రమే ఎలా నడుస్తున్నారని కొంత మంది విలేకరులు రాహుల్‌ను ప్రశ్నించారు.

చలికాలంలో ఓన్లీ టీషర్ట్ మీద యాత్ర.. రాహుల్ జీ.. మీకు చలి వేయదా?
X

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నది. దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుంచి ప్రారంభించిన ఈ యాత్ర దాదాపు 3వేల కిలోమీటర్లకు చేరుకున్నది. ఢిల్లీలో వేలాది మంది ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు రాహుల్‌ను అభినందించడానికి పోటీ పడ్డారు. ఇక సినీ నటుడు కమల్ హాసన్ కూడా ఢిల్లీలో రాహుల్ వెంట నడిచారు. చిన్నారుల నుంచి ముసలి వారి వరకు అందరూ రాహుల్‌ పాదయాత్రను చూసి ఆశ్చర్యపోతున్నారు. చలి కాలం... అందులో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండే ఉత్తరాదిలో రాహుల్ కేవలం ఒక టీషర్ట్ మాత్రమే వేసుకొని నడుస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇంత చలిలో కేవలం టీషర్ట్ వేసుకొని మాత్రమే ఎలా నడుస్తున్నారని కొంత మంది విలేకరులు రాహుల్‌ను ప్రశ్నించారు. మీకు అసలు చలి వేయదా అని అడుగుతున్నారు. దీనికి రాహుల్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. 'చాలా మంది నన్ను టీషర్ట్ మాత్రమే వేసుకొని ఎలా నడుస్తున్నారు. మీకు చలేయదా అని ప్రశ్నిస్తున్నారు. మరి చలికాలంలో వెచ్చటి దుస్తులు కూడా కొనుక్కోలేని రైతులు, కార్మికులు, పేద పిల్లలను ఎందుకు అడగరు. నేను ఇప్పటికే 2800 కిలోమీటర్లు నడిచాను. నాకు వాతావరణం అలవాటు అయ్యింది. అలాంటి సమయంలో నాకు టీషర్ట్ మాత్రమే ఉండటం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. రోజూ రైతులు, కార్మికులు, కూలీలు ఇలాగే దేశంలో తిరుగుతున్నారు' అని రాహుల్ చెప్పారు.

ఇక రాహుల్ చలిలో ఉన్ని దుస్తులు ధరించకుండా నడవటంపై పార్టీ నేత కన్హయ్య కుమార్ మరో విధంగా స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇప్పటికే రాహుల్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. వివిధ వర్గాల నుంచి తీవ్రమైన దాడులు ఎదురైనప్పుడు సహజంగానే శరీరానికి అన్నింటినీ తట్టుకునే సామర్థ్యం వస్తుందని కన్హయ్య కుమార్ అన్నారు.

First Published:  25 Dec 2022 8:05 AM GMT
Next Story