Telugu Global
National

ఠారెత్తిస్తున్న ట‌మాటా.. - గ‌వ‌ర్న‌ర్ సైతం స‌రికొత్త నిర్ణ‌యం

కేజీ టమాటా ధర రూ.200 దాటిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు టమాటా వినియోగం తగ్గించడం వల్ల ధరలను అదుపులోకి తేవ‌చ్చ‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ఠారెత్తిస్తున్న ట‌మాటా.. - గ‌వ‌ర్న‌ర్ సైతం స‌రికొత్త నిర్ణ‌యం
X

ట‌మాటా ధ‌ర‌లు కొన్ని రోజులుగా సామాన్య ప్ర‌జ‌ల‌ను ఠారెత్తిస్తున్న విష‌యం తెలిసిందే. ఇవి ఇప్ప‌ట్లో త‌గ్గే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌క‌పోగా.. మ‌రింత పెరుగుతుండ‌టం స‌ర్వ‌త్రా ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఈ నేప‌థ్యంలో పంజాబ్ గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రిలాల్ పురోహిత్ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ్ భవన్‌లో ఇక నుంచి కొన్ని రోజులపాటు టమాటా లేని వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తన కార్యాలయ సిబ్బందికి సూచించారు. కేజీ టమాటా ధర రూ.200 దాటిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు టమాటా వినియోగం తగ్గించడం వల్ల ధరలను అదుపులోకి తేవ‌చ్చ‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతానికి పరిపాలకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. తన తాజా నిర్ణయంతో ధరలు దిగివస్తాయని ఆయన ఆశిస్తున్నారు. అధిక ధరల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఏదైనా ఒక వస్తువును వినియోగించడం తగ్గిస్తే దానికున్న డిమాండ్ ఆటోమేటిక్‌గా త‌గ్గుతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. ప్ర‌జ‌లు త‌మ కూర‌ల్లో ట‌మాటాల‌కు ప్ర‌త్యామ్నాయ కూర‌గాయ‌ల‌ను వినియోగించే ప్ర‌య‌త్నం చేయాల‌ని ఆయ‌న సూచించారు. త‌ద్వారా ట‌మాటా ధ‌ర‌లు దిగివ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

First Published:  4 Aug 2023 2:56 AM GMT
Next Story