Telugu Global
National

మిస్త్రీ కారు నడిపిన లేడీ డాక్టర్.. అప్పుడు స్పీడ్ 120..

ప్రమాదం జరిగిన సమయంలో మెర్సిడిస్ కార్ స్పీడ్ 120 కిలోమీటర్లకంటే ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు.

మిస్త్రీ కారు నడిపిన లేడీ డాక్టర్.. అప్పుడు స్పీడ్ 120..
X

సైరస్ మిస్త్రీ కారు ప్రమాదానికి అతి వేగమే కారణం అని నిర్ధారించారు పోలీసులు. ప్రమాదానికి గురైన సమయంలో కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. రాంగ్ సైడ్ లో మరో కారుని ఓవర్ టేక్ చేయబోయి, డివైడర్ ని ఢీకొంది. వెంటనే స్థానికులు స్పందించడంతో ఇద్దరు బతికారు, ఇద్దరు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు.

అహ్మదాబాద్ టు ముంబై..

అహ్మదాబాద్ నుంచి మిస్త్రీ సహా డాక్టర్ అనహిత పండోలే కుటుంబం ఈ కారులో ముంబై బయలుదేరారు. కారుని ముంబైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ అనహిత పండోలే (55) నడిపారు. పక్క సీట్లో ఆమె భర్త డారియస్ పండోలే (60) కూర్చున్నారు. వెనక సీట్లో సైరస్ మిస్త్రీతోపాటు, డారియస్ పండోలే సోదరుడు జహంగీర్ పండోలే ఉన్నారు. వెనక సీట్లో ఉన్న ఇద్దరు స్పాట్ లోనే మరణించగా. ముందు కూర్చున్న డాక్టర్ పండోలే దంపతులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

స్పీడ్ 120పైనే..

ప్రమాదం జరిగిన సమయంలో మెర్సిడిస్ కార్ స్పీడ్ 120 కిలోమీటర్లకంటే ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. ఓవర్ స్పీడ్ తో పాటు, రాంగ్ రూట్ లో ముందు వెళ్తున్న వాహనాన్ని క్రాస్ చేయబోయే సరికి ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మిస్త్రీ మరణంపై ప్రధాని మోదీ, మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా ఇతర ప్రముఖులు స్పందించారు. ఆయన మరణం వ్యాపార రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు. "సైరస్ మిస్త్రీ మరణ వార్త విని షాకయ్యా.. ఆయనతో నాకు 8 ఏళ్ల స్నేహ బంధం ఉంది. ఒక మంచి మనిషిని కోల్పోయాం." అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.

First Published:  5 Sep 2022 3:01 AM GMT
Next Story