Telugu Global
National

రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు... మండిపడ్డ కాంగ్రెస్

రాహుల్ గాంధీకి నోటీసులు ఇవ్వడం, పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది.లైంగిక వేధింపుల బాధితుల వివరాలు ఇవ్వాలని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు... మండిపడ్డ కాంగ్రెస్
X

45 రోజుల క్రితం భారత్ జోడో యాత్రలో భాగం గా కశ్మీ ర్లో ప్రసంగించిన రాహుల్ గాంధీ అక్క డి మహిళలు ఇంకా లైంగిక వేధింపులకు, అత్యా చారాలకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇద్దరు మహిళలు తన దగ్గరికొచ్చి తమపై సామూహిక అత్యాచారం జరిగిందని వారు తనకు చెప్పారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని తాను వారికి చెప్పానని, ఫిర్యాదు చేస్తే తమకు పెళ్లిళ్లు కావనే ఉద్దేశంతో, ఫిర్యాదు చేసేందుకు వారు తిరస్కరించారని తెలిపారు.

రాహుల్ గాంధీ మాట్లాడిన ఈమాటల నేపథ్యంలో ఆ మహిళలు ఎవరో చెప్పాలని పోలీసులు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు అందజేయడానికి ఢిల్లీ పోలీసులు ఈ రోజు ఆయన ఇంటికి వెళ్ళారు.

రాహుల్ గాంధీకి నోటీసులు ఇవ్వడం, పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది.లైంగిక వేధింపుల బాధితుల వివరాలు ఇవ్వాలని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అదానీ అవకతవకలపై తమ ప్రశ్నలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, అందుకే ఢిల్లీ పోలీసుల ద్వారా ఈ నాటకానికి తెర తీశారని ఆరోపించింది. భారత్ జోడో యాత్ర ముగిసిన 45 రోజుల తర్వాత ఢిల్లీ పోలీసులు రాహుల్ ఇంటికి వెళ్లడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తప్పుబట్టారు. ఢిల్లీ పోలీసుల నోటీసుకు రాహుల్ న్యాయవాదుల టీమ్ చట్టప్రకారం స్పందిస్తుందని ఆయన చెప్పారు

First Published:  19 March 2023 11:56 AM GMT
Next Story