Telugu Global
National

విజయ్ ఏందిది.. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్.. పీఎంకే నేత రాందాస్ కౌంటర్..!

విజయ్ కొన్నేళ్ల క్రితం వాగ్దానం చేశారని, ఇప్పుడు ఆ వాగ్దానం ఏమైంది..? అని రాందాస్ ప్రశ్నించాడు. విజయ్ సినిమాల్లో సిగరెట్లు కాల్చే సన్నివేశాలు పెట్టి అభిమానులను చెడుదోవ పట్టిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

విజయ్ ఏందిది.. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్.. పీఎంకే నేత రాందాస్ కౌంటర్..!
X

ప్ర‌స్తుత‌ రాజకీయాలపై ఇటీవల త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కౌంటర్లు వేశాడు. ఆయన అలా కౌంటర్లు వేశాడో లేదో.. అప్పుడే ఆయనపై పొలిటికల్ లీడర్ల దాడి మొదలైంది. రాజకీయాలపై విజయ్ విమర్శలు చేసి గంటలు గడవక ముందే ఆయన నటించిన సినిమాపై రాజకీయ నాయకుల విమర్శలు మొదలయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా టెన్త్, ఇంటర్ ప‌రీక్ష‌ల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇటీవల విజయ్ ప్రోత్సాహక బహుమతులు అందించాడు. ఈ సందర్భంగా విజయ్ ప్ర‌స్తుత‌ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ప్రజల నుంచి డబ్బు దోచుకుంటారని.. ఆ డబ్బే మళ్ళీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు పంచుతారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.

ఇలా రాజకీయాలపై విజయ్ విమర్శలు చేయగా.. ఇప్పుడు ఆయన నటించిన సినిమాపై పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ కౌంటర్లు వేశారు. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో `లియో` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈనెల 22వ తేదీన విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చాడు డైరెక్ట‌ర్ లోకేష్‌. లియో నుంచి అలర్ట్ ఈగో నా రెడీ.. అనే పల్లవితో సాగే తొలి పాటను విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ పోస్టర్లో విజయ్ చేతిలో గన్ను, నోట్లో సిగరెట్‌తో కనిపించాడు.

ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుండగా.. రాజకీయ నాయకులు మాత్రం మండిపడుతున్నారు. ఈ పోస్టర్ పై రాందాస్ స్పందిస్తూ.. 'నా చిత్రాల్లో ఇకపై మద్యం తాగే సన్నివేశాలు, సిగరెట్లు కాల్చే సన్నివేశాలు ఉండవు` అని విజయ్ కొన్నేళ్ల క్రితం వాగ్దానం చేశారని, ఇప్పుడు ఆ వాగ్దానం ఏమైంది..? అని రాందాస్ ప్రశ్నించాడు. విజయ్ సినిమాల్లో సిగరెట్లు కాల్చే సన్నివేశాలు పెట్టి అభిమానులను చెడుదోవ పట్టిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

త్వరలో విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి వేదిక సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే రాజకీయాలపై విజయ్ విమర్శలు చేయడం మొదలుపెట్టగా.. ఆయనకు కూడా అప్పుడే రాజకీయ నాయకుల నుంచి కౌంటర్లు కూడా మొదలయ్యాయి.

First Published:  18 Jun 2023 6:19 AM GMT
Next Story