Telugu Global
National

ఒక దేశం ఒకే పోలీసు యూనిఫార్మ్...మోడీ మరో కొత్త రాగం

ఈ రోజు హర్యానాలోని సూరజ్‌కుండ్ లో రాష్ట్రాల హోం మంత్రుల చింతన్ శివిర్‌ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ... 'ఒక దేశం ఒకే పోలీసు యూనిఫార్మ్' ఉండాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షించడం కోసం రాష్ట్రాలు కేంద్రానికి సహకారం ఇవ్వాలని మోడీ కోరారు.

ఒక దేశం ఒకే పోలీసు యూనిఫార్మ్...మోడీ మరో కొత్త రాగం
X

ఒక దేశం ఒకే భాష, ఒక దేశం ఒకే సంస్కృతి, ఒకే దేశం ఒకే చట్టం, ఒక దేశం ఒకే ఎన్నిక....ఇలాంటి నినాదాలిచ్చే మోడీ ఇప్పుడు ఒక దేశం ఒకే పోలీసు యూనిఫార్మ్ అనే ఆలోచన మొదలుపెట్టారు. ఈ రోజు హర్యానాలోని సూరజ్‌కుండ్ లో రాష్ట్రాల హోం మంత్రుల చింతన్ శివిర్‌ను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ... 'ఒక దేశం ఒకే పోలీసు యూనిఫార్మ్' ఉండాలని పిలుపునిచ్చారు.

ఒకే పోలీసు యూనిఫార్మ్ గురించి మాట్లాడిన ప్రధాని మోడీ ఇది వెంటనే జరగకపోవచ్చు 5 ఏళ్ళు పట్టొచ్చు, 100 ఏళ్ళు పట్టొచ్చు కానీ ఇది జరగాలి అని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ దేశ సమైక్యత, అఖండతల బాధ్యత రాష్ట్రాల మీద కూడా ఉంటుంది. అందుకే ఒకే పోలీసు యూనిఫార్మ్ ఉండాలి అని మోడీ అన్నారు. అంతేకాకుండా, నేరాలు మరియు నేరస్థులను ఎదుర్కోవడానికి రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారం ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు.

నేరస్తులు చేస్తున్న నేరాలు గతంలో లాగా లేవని, అంత రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయని, నేరస్తులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞాన‍ం దేశ సరిహద్దుల దాటుతోందని ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కేంద్రంతో కలిసిరాకపోతే వీటిని ఎదుర్కోవడం అసాధ్యమన్నారు మోడీ.

పాత చట్టాలను సమీక్షించాలని, వాటిని ప్రస్తుత పరిస్థితులకుఅనుగుణంగా సవరించాలని ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

కాగా ఈ నెల ప్రారంభంలో, కేంద్రం 'ఒక దేశం, ఒకే ఎరువులు'ని ప్రకటించింది, దీని కింద సబ్సిడీ ఎరువులన్నీ దేశవ్యాప్తంగా 'భారత్' బ్రాండ్‌తో విక్రయించబడతాయి.

First Published:  28 Oct 2022 9:11 AM GMT
Next Story