Telugu Global
National

'మన ప్రధాని చైనాకు అప్పనంగా 1000 చదరపు కిలో మీటర్ల భూమిని అప్పగించారు'

ప్రధాని నరేంద్ర మోడికి చౌకబారు ప్రచారాలు తప్ప దేశ భద్రత పట్టడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ఎలాంటి ప్రతిఘటన, యుద్దం లేకుండా చైనాకు వేయి చదరపు కిలోమీటర్ల భూమిని అప్పగించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

మన ప్రధాని చైనాకు అప్పనంగా 1000 చదరపు కిలో మీటర్ల భూమిని అప్పగించారు
X

ఎలాంటి యుద్ధం లేకుండానే నరేంద్ర మోడీ సర్కార్ వెయ్యి చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు అప్పనంగా అప్పగించేసిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆ భూమిని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారు అని ఆయన ప్రశ్నించారు. సరిహద్దులో 2020 ఏప్రిల్‌ నాటి యథాతథస్థితి పునరుద్ధరణ చేయాలన్న భారత దేశ డిమాండ్ ను చైనా నిరాకరిస్తోందని రాహుల్ అన్నారు.

"ఏప్రిల్ 2020 నాటి యథాతథ స్థితిని పునరుద్ధరించాలన్న భారతదేశ డిమాండ్‌ను అంగీకరించడానికి చైనా నిరాకరించింది. ప్రధాని ఎటువంటి పోరాటం లేకుండా చైనాకు 1,000 చ.కి.మీ భూభాగాన్ని ఇచ్చారు. ఈ భూభాగాన్ని ఎలా తిరిగి పొందుతారో భారత ప్రభుత్వం వివరించగలదా" అని రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

మరో వైపు పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే మాట్లాడుతూ, భారత సైన్యం గస్తీని నిర్వహించే ప్రాంతాల్లో మన సైన్యాన్ని వెనక్కి రప్పించడం, బఫర్ జోన్‌లను సృష్టించడం ఇది మొదటిసారి కాదని అన్నారు.

"మొదట గాల్వాన్‌లో జరిగింది, తర్వాత గోగ్రాలో జరిగింది, ఇప్పుడు హాట్‌స్ప్రింగ్స్‌లో జరుగుతోంది. మన సైన్యాన్ని ఎందుకు వెనక్కి తీసుకొచ్చారు? ఇప్పటివరకు మనం గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్ పాయింట్లను మన సైన్యం ఎందుకు వదులుకునేలా చేస్తున్నారు?" శ్రీనతే ప్రశ్నించారు.

ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న ఎస్‌సిఓ శిఖరాగ్ర సమావేశంలో, చైనా అధ్యక్షుడు జి జింగ్‌పింగ్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్న నేపథ్యంలో ఈ వెనకడుగు ప్రక్రియ జరిగిందని శ్రీనతే పేర్కొన్నారు.

"ఏప్రిల్ 2020 నాటి యథాతథ స్థితి ఇప్పుడు ఎందుకు లేదు?" ''మన భద్రత, విదేశాంగ విధానం విషయంలో ఎందుకు రాజీ పడుతున్నాయని మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము?" అని ఆమె అడిగారు.

ప్రధానమంత్రికి చౌకబారు ప్రచార యావ‌ తప్ప‌ మన ప్రాదేశిక సమగ్రత గురించి, మన దేశ భద్రత గురించి పట్టింపు లేదని ఆమె ఆరోపించారు.

First Published:  15 Sep 2022 3:48 AM GMT
Next Story