Telugu Global
National

స‌హ‌జీవ‌నాల‌ను రిజిస్ట‌ర్ చేయాలంటూ దాఖ‌లైన్ పిటిష‌న్ కొట్టివేత‌

రిలేష‌న్‌షిప్‌లో ఉండే ప్ర‌తి జంటా రిజిస్ట్రేష‌న్ త‌ప్పనిస‌రిగా చేసుకోవాల‌ని, ఆ జంట‌ల‌కు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించాలంటూ ఈ అంశంపై ఓ న్యాయ‌వాది ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు.

స‌హ‌జీవ‌నాల‌ను రిజిస్ట‌ర్ చేయాలంటూ దాఖ‌లైన్ పిటిష‌న్ కొట్టివేత‌
X

దేశంలో స‌హ‌జీవ‌నాల‌కు గుర్తింపు క‌ల్పించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు సోమ‌వారం కొట్టివేసింది. అది ఒక మూర్ఖ‌పు ఆలోచ‌న‌గా అత్యున్న‌త ధ‌ర్మాస‌నం చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ వ్యాఖ్యానించారు.

రిలేష‌న్‌షిప్‌లో ఉండే ప్ర‌తి జంటా రిజిస్ట్రేష‌న్ త‌ప్పనిస‌రిగా చేసుకోవాల‌ని, ఆ జంట‌ల‌కు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించాలంటూ ఈ అంశంపై ఓ న్యాయ‌వాది ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని దాఖ‌లు చేశారు. ఈ మేర‌కు నిబంధ‌న‌లు రూపొందించాలంటూ పిటిష‌న్‌లో కోరారు.

ఈ పిటిష‌న్‌పై ఘాటుగా స్పందించిన చీఫ్ జ‌స్టిస్‌.. ఎలాంటి విష‌యంతోనైనా ఇక్క‌డికి వ‌స్తున్నారు.. ఇక‌పై ఇలాంటి వాటిపై జ‌రిమానాలు విధించడం మొద‌లుపెడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రితో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి.. కేంద్ర ప్ర‌భుత్వంతోనా.. స‌హ‌జీవ‌నంలో ఉన్న జంట‌ల‌తో కేంద్ర ప్ర‌భుత్వానికి ఏం పని అని సీజే నిల‌దీశారు.

అస‌లు ఏ ఉద్దేశంతో ఈ పిటిష‌న్ వేశార‌ని న్యాయ‌వాదిని ప్ర‌శ్నించిన చీఫ్ జ‌స్టిస్‌కి.. సోష‌ల్ జ‌స్టిస్ అని ఆయ‌న స‌మాధాన‌మివ్వ‌డంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ పిటిష‌న్‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సీజేఐ దానిని డిస్మిస్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

First Published:  20 March 2023 10:07 AM GMT
Next Story