Telugu Global
National

కొత్త పార్లమెంట్‌ భవనంలోనే స్పెషల్‌ సెషన్‌..!

కొత్త పార్లమెంట్‍లో నిర్వహించనున్న మొదటి సమావేశాల్లోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం తెరమీదకు వచ్చిన జమిలీ ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, మహిళా రిజర్వేషన్‌ లాంటి బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

కొత్త పార్లమెంట్‌ భవనంలోనే స్పెషల్‌ సెషన్‌..!
X

కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్‌ నూతన పార్లమెంట్‌ బిల్డింగ్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. మే 28న మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఐతే కొత్త పార్లమెంట్ భనంలో మొదటి సమావేశాలను వచ్చే ఏడాది ఎన్నిక కానున్న కొత్త ప్రభుత్వమే నిర్వహిస్తుందని ప్రచారం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే సెప్టెంబర్ 18న పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయి. వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్ 19 నుంచి కొత్త భవనంలో నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఇక కొత్త పార్లమెంట్‍లో నిర్వహించనున్న మొదటి సమావేశాల్లోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం తెరమీదకు వచ్చిన జమిలీ ఎన్నికలు, ఇండియా పేరు మార్పు, మహిళా రిజర్వేషన్‌ లాంటి బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే నూతన పార్లమెంట్‌ మొదటి సమావేశంలోనే దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సెషన్‌ అజెండాను మాత్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు.

First Published:  6 Sep 2023 10:09 AM GMT
Next Story