Telugu Global
National

ఉగ్రవాదులను పాకిస్థాన్‌లోకి వెళ్లి మరీ...

ఉగ్రవాదాన్ని భారత్‌ సహించబోదన్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. అవసరమైతే పాకిస్థాన్‌ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టుపెడుతామని హెచ్చరించారు.

ఉగ్రవాదులను పాకిస్థాన్‌లోకి వెళ్లి మరీ...
X

ఉగ్రవాదాన్ని భారత్‌ సహించబోదన్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. అవసరమైతే పాకిస్థాన్‌ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టుపెడుతామని హెచ్చరించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అనుమానాస్పద మృతికి భారతే కారణమంటూ బ్రిటన్ పత్రిక ప్రచురించిన కథనాన్ని రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు.

రాజ్‌నాథ్ ఏమన్నారంటే.." పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపాలనే భారత్‌ ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ, ఉగ్రవాదుల చర్యలను ప్రతీసారి భారత్‌ ఉపేక్షించదు. భారత్‌లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం.. ఈ దేశ ఆగ్రహం ఎలా ఉంటుందో వాళ్లు చవిచూడాల్సి వస్తుంది. ఒకవేళ ఉగ్రవాదులు భారత్‌లో దాడులకు పాల్పడి పాకిస్థాన్‌లోకి గనుక పారిపోతే.. వెంటాడుతాం. ఆ భూభాగంలోకి వెళ్లి మరీ మట్టుపెడతాం. మాకు ఆ సామర్థ్యం ఉంది. అది చేసి తీరతాం కూడా. పొరుగు దేశం కూడా అది గుర్తిస్తే మంచిది’’ అంటూ పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు రాజ్‌నాథ్ సింగ్.

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌లో వరుసగా ఉగ్రవాద నేతలు చనిపోతున్నారు. వాళ్లంతా అనుమానాస్పద రీతిలో.. గుర్తు తెలియని దాడుల్లో చనిపోతున్నారు. ఒక ప్లాన్‌ ప్రకారమే ఈ హత్యలు జరుగుతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిచింది. ఈలోపు బ్రిటన్‌కు చెందిన గార్డియన్‌ పత్రిక.. విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్‌ నిఘా ఏజెన్సీ హత్యలు చేయిస్తోందని పెద్ద కథనం ప్రచురించింది. ఆ ఆరోపణల్ని ఖండించిన రాజ్‌నాథ్‌సింగ్... ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు.

First Published:  6 April 2024 11:15 AM GMT
Next Story