Telugu Global
National

2,3 ఏళ్ళలో PoK భారత్‌లో భాగమవుతుంది... హర్యానా మంత్రి ప్రకటన‌

“PoK భారతదేశంలో భాగమయ్యే సమయం ఎంతో దూరంలో లేదు. అది ఏ క్షణమైనా జరగవచ్చు. బహుశా రెండేళ్లలో, మూడేళ్లలో లేదా ఐదేళ్లలో.... కానీ PoK భారతదేశంలో భాగమవుతుంది, ”అని గుప్తా అన్నారు.

2,3 ఏళ్ళలో PoK భారత్‌లో భాగమవుతుంది... హర్యానా మంత్రి ప్రకటన‌
X

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) వచ్చే రెండు మూడేళ్లలో భారత్‌లో భాగమవుతుందని హర్యానా మంత్రి డాక్టర్ కమల్ గుప్తా ప్రకటించారు. రోహతక్ లో భారతీయ జనతా పార్టీ వర్తకుల సెల్ సమావేశంలో ప్రసంగించిన ఆయన....

“1962లో, తూర్పు లడఖ్‌లోని 38,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం భూమిని చైనా అక్రమంగా ఆక్రమించింది. 2014కి ముందు మనం ఈరోజు ఉన్నంత బలంగా లేము. ఇప్పుడు మనం అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాము, ఆర్టికల్ 370ని రద్దు చేసాము. ఇప్పుడు చాలా బలంగా ఉన్నాము.'' అన్నారాయన

“PoK భారతదేశంలో భాగమయ్యే సమయం ఎంతో దూరంలో లేదు. అది ఏ క్షణమైనా జరగవచ్చు. బహుశా రెండేళ్లలో, మూడేళ్లలో లేదా ఐదేళ్లలో.... కానీ PoK భారతదేశంలో భాగమవుతుంది, ”అని గుప్తా అన్నారు.

2016 పాకిస్తాన్ పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కు రుజువు కావాలని డిమాండ్ చేసినందుకు ప్రతిపక్షాలపై ఆయన దుమ్మెత్తి పోశారు. ప్రతిపక్ష నాయకులంతా "జైచంద్‌లు" అని అభివర్ణించారు. (మహమ్మద్ ఘోరీతో జరిగిన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ కు రాజ్‌పుత్ రాజు జైచంద్ ద్రోహం చేశారు.)

"జైచంద్ వంటి వ్యక్తులు నేటికీ మనదేశంలో ఉన్నారు, వారు మన సైనికులు జరిపిన వైమానిక దాడులకు రుజువు కావాలని డిమాండ్ చేస్తున్నారు" అని గుప్తా అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి గుప్తా మాట్లాడుతూ, భారత్ జోడో యాత్రను నిర్వహించిన వారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బాధ్యులని అన్నారు.

మంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) జాతీయ కార్యదర్శి , అంతర్గత సమాచారాల ఇన్‌ఛార్జ్ వినీత్ పునియా, దేశం ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను వదిలేసి లేనిపోని సంచలనాలను సృష్టించేందుకు నకిలీ వార్తలను సృష్టించే కళలో బీజేపీ ప్రావీణ్యం సంపాదించిందని అన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం, 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూమిని చైనా ఆక్రమించడంపై ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానాలు కోరుకుంటున్నారు. అని ఆయన అన్నారు.

First Published:  7 March 2023 4:34 AM GMT
Next Story