Telugu Global
National

గుజరాత్‌లో 41 వేల మంది మహిళల అదృశ్యం...నోరు మెదపని మోడీ

గుజరాత్ లో ఐదేళ్ళలో 41 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. మాయమైపోయారు. నిజం చెప్పాలంటే కిడ్నాప్ అయ్యారు. వాళ్ళ గురించి వెతుకులాటలేదు. వాళ్ళ ఆచూకీ తెలియదు. ఈ 41 వేల లెక్క ఎవరో బీజేపీ శత్రువులు చెప్పిన లెక్క కాదు. స్వయంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) చెప్తున్న గణాంకాలివి.

గుజరాత్‌లో 41 వేల మంది మహిళల అదృశ్యం...నోరు మెదపని మోడీ
X

ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం, అనేక ఏళ్ళుగా బీజేపీ ఏలుబడిలో ఉన్నరాష్ట్రమైన గుజరాత్ గురించి మోడీతో సహా బీజేపీ నేతలంతా పొగడ్తలతో ముంచెత్తుతారు. గుజరాత్ మోడల్ అని ఆ రాష్ట్రాన్ని ఆకాశానికెత్తుతారు. అక్కడ జరిగిన అభివృద్ది దేశంలో ఎక్కడా జరగలేదని ఊద‌రగొడతారు. అయితే ఆ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను గురించి మాత్రం నోరు మెదపరు. తెలియనట్టే నటిస్తారు.

గుజరాత్ లో ఐదేళ్ళలో 41 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. మాయమైపోయారు. నిజం చెప్పాలంటే కిడ్నాప్ అయ్యారు. వాళ్ళ గురించి వెతుకులాటలేదు. వాళ్ళ ఆచూకీ తెలియదు. ఈ 41 వేల లెక్క ఎవరో బీజేపీ శత్రువులు చెప్పిన లెక్క కాదు. స్వయంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) చెప్తున్న గణాంకాలివి.

NCRB చెప్తున్న లెక్కల ప్రకారం

2016లో, 7105 మంది మహిళలు మాయమయ్యారు.

2017లో 7712;

2018లో 9246;

2019లో 9268;

2020లో 8290 మంది మహిళలు మాయమయ్యారు.

5 ఏళ్ళలో గుజరాత్‌లోనే తప్పిపోయిన మొత్తం మహిళల సంఖ్య‌ 41,621.

ఇలా మాయమైన మహిళలు, ఎక్కువమందిని అక్రమ రవాణా చేసి అమ్మేస్తున్నారు. వీరితో వ్యభిచారం చేయిస్తున్నారు. వినకపోతే హత్యలుకుడా జరుగుతున్నాయి.

మిస్సింగ్ కేసును హత్య కేసులా సీరియస్‌గా తీసుకోవడం లేదని మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు సుధీర్ సిన్హా అన్నారు.

“మిస్సింగ్ కేసులను హత్య కేసులతో సమానంగా చూడాలి . ఒక బిడ్డ తప్పిపోతే, తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూఉంటారు. పోలీసు వ్యవస్థ మామూలుగా ఇలాంటి కేసులను పెద్దగా పట్టించుకోదు. గుజరాత్‌ పోలీసులు ఈ కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం వహిస్తున్నారు.'' అని ఆయన పేర్కొన్నారు.

బాలికలు, మహిళలు అదృశ్యం కావడానికి మానవ అక్రమ రవాణాయే కారణమని రాష్ట్ర మాజీ అదనపు డిజిపి డాక్టర్‌ రాజన్‌ ప్రియదర్శి తెలిపారు.

“నేను ఖేడా జిల్లాలో (గుజరాత్) ఎస్‌పిగా ఉన్న‌ప్పుడు, యుపికి చెందిన ఒక దినసరి కూలీ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన బాలికను అపహరించి తన సొంత రాష్ట్రంలో విక్రయించిన కేసు వచ్చింది. అక్కడ ఆ అమ్మాయితో వ్యవసాయ కూలీగా పనిచేయించారు. మేము ఆమెను రక్షించగలిగాము. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో ఇటువంటి కేసులు పరిష్కారానికి నోచుకోలేదు. ”అని రాజన్‌ ప్రియదర్శి అన్నారు.

“బీజేపీ నేతలు కేరళలోని మహిళల గురించి మాట్లాడుతున్నారు. అబద్దాలతో నిండిన 'ది కేరళ స్టోరీ' మూవీ గురించి ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రధాని మోడీ గానీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గానీ తమ రాష్ట్రంలో 40 వేల మందికి పైగా మహిళలు కన్పించకుండా పోతే పెదవి విప్పరు.'' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి హిరేన్ బ్యాంకర్ మండిపడ్డారు.

First Published:  8 May 2023 2:44 AM GMT
Next Story