Telugu Global
National

స్కూల్ కు వెళ్ళని పిల్లలు అధికంగా ఉన్నది బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే

వరుసగా రెండవసారి బిజెపి పరిపాలిస్తున్న‌ ఉత్తరప్రదేశ్ లో 3,96,655 మంది పిల్లలు బడి బయట (OoSC)ఉన్నారు. ఇది 2022-23లో దేశంలోనే అత్యధికం.

స్కూల్ కు వెళ్ళని పిల్లలు అధికంగా ఉన్నది బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే
X

ప్రాథమిక స్థాయిలో పాఠశాలలో లేని పిల్లలు అధికంగా ఉన్నది బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అని గణాంకాలు తెలియజేస్తున్నవి.

వరుసగా రెండవసారి బిజెపి పరిపాలిస్తున్న‌ ఉత్తరప్రదేశ్ లో 3,96,655 మంది పిల్లలు బడి బయట (OoSC)ఉన్నారు. ఇది 2022-23లో దేశంలోనే అత్యధికం. ఈ జాబితాలో బీహార్ రెండవ‌ స్థానంలో ఉంది. అక్కడ 1,34,252 పిల్ల‌లు బడి బయట ఉన్నారు. అనేక ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం గుజరాత్ లో 1,06,885 పిల్లలు బడి బయట ఉన్నారు.

మరోవైపు, తెలంగాణలో కేవలం 4,556 మంది పిల్లలు మాత్రమే బడి బయట ఉన్నారు. అస్సాంలో 80,739 మధ్యప్రదేశ్ లో18,678, మహారాష్ట్రలో 15,707, కర్ణాటకలో 5,945 మంది పిల్లలు బడిబయట ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగమైన వారణాసి జిల్లాలో 5,788 మంది పిల్లలు బడి బైట ఉన్నారు. ఈ సంఖ్య తెలంగాణ కంటే చాలా ఎక్కువ.

పార్లమెంటులో ఓ ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు జవాబుగా ఈ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి ఇటీవల లోక్‌సభలో సమర్పించారు.

బడిబయట పిల్లలు(OoSC) అంటే పాఠశాలలో అసలు చేరని లేదా ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికంటే ముందే (ఆరు-14 వయస్సు) బడి మానేసిన పిల్లలను సూచిస్తుంది.

బీజేపీ డబుల్ ఇంజన్ గవర్నెన్స్ ప్రచారంపై అపహాస్యం చేస్తూ, OoSC జాబితాలో యూపీ, గుజరాత్‌లు అగ్రస్థానం కోసం పోటీపడుతున్నాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఇటీవల ట్వీట్ చేశారు. ఇది డబుల్ ఇంజిన్ కాదని, ఇంజిన్ లేని పాలన అని ఆమె అన్నారు.

First Published:  20 March 2023 5:31 AM GMT
Next Story