Telugu Global
National

అదానీపై హిడెన్ బర్గ్ నివేదిక: దద్దరిల్లిన పార్లమెంటు

జాంబియా నుంచి వచ్చిన పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికి ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించిన వెంటనే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీనిపై బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. గొడవ‌ చేయవద్దని సభ్యులను కోరారు. అయినప్పటికీ విపక్షాలు వినకుండా తమ నిరసనను కొనసాగించాయి.

అదానీపై హిడెన్ బర్గ్ నివేదిక: దద్దరిల్లిన పార్లమెంటు
X

న్యూయార్క్‌కు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో గౌతమ్ అదానీ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో లోక్‌సభ, రాజ్యసభలు గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.

జాంబియా నుంచి వచ్చిన పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికి ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించిన వెంటనే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీనిపై బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. గొడవ‌ చేయవద్దని సభ్యులను కోరారు. అయినప్పటికీ విపక్షాలు వినకుండా తమ నిరసనను కొనసాగించాయి.

అదానీ సమస్య, సరిహద్దులో చైనా అక్రమాలు, రాష్ట్రాల్లో గవర్నర్ల పాత్ర వంటి అంశాలను సభలో చర్చించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. వీటిపై ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. పెరుగుతున్న ధరలు, విస్తరిస్తున్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి బడ్జెట్ కేంద్రం ఎలాంటి పరిష్కారాలు చూపలేదని విమర్శించాయి. అయితే స్పీకర్ విపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్కరించారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంపీ బినోయ్ విశ్వం గురువారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంకర్‌కు అదానీ స్టాక్ క్రాష్‌పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

రూల్ 267 కింద నోటీసును అందిస్తూ, ప్రస్తుతం అదానీ గ్రూపుతో ఏర్పడిన సంక్షోభం కారణంగా దేశ ప్రజలకు చెందిన డబ్బు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని సీపీఐ ఎంపీ అన్నారు. అయితే స్పీకర్ దానిని సస్పెండ్ చేశారు.

దీంతో ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటయ్యి నిరసనకు దిగాయి. దాంతో స్పీకర్ సభను 2 గంటలవరకు వాయిదా వేశారు.

First Published:  2 Feb 2023 6:51 AM GMT
Next Story