Telugu Global
National

పార్లమెంటులో సతీసహగమనాన్ని కీర్తించిన బీజేపీ ఎంపీ... భగ్గుమన్న విపక్షాలు

"రాణి పద్మావతి 16,000 రాణీవాసపు స్త్రీలతో కలిసి తనను తాను మంటలకు ఆహుతి చేసుకుంది. కానీ మీ ప్రభుత్వం ఆ స్థలం చుట్టూ అడ్డంకులు పెట్టింది. మా ప్రభుత్వం ఇప్పుడు ఈ సైట్‌ను గుర్తించింది’’ అని బీజెపి ఎంపీ చంద్ర ప్రకాష్ జోషి అన్నారు.

పార్లమెంటులో సతీసహగమనాన్ని కీర్తించిన బీజేపీ ఎంపీ... భగ్గుమన్న విపక్షాలు
X

పార్లమెంటులో ఒకవైపు అదానీ స్కాంపై నిరసనలు, వాకౌట్లు జరుగుతుండగానే మరో వివాదం చెలరేగింది.లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించిన బీజేపీ ఎంపీ చంద్ర ప్రకాష్ జోషి సతి ఆచారాన్ని కీర్తించారనే ఆరోపణలతో విపక్షాలు ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ వెల్ లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు.

NDTV వార్తా నివేదికల ప్రకారం, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదించిన రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎంపీ జోషి, “రాణి పద్మావతి జిన్హోనే అప్నే సతీత్వ కీ రక్షా కే లియే అలావుద్దీన్ ఖిల్జీ కో కభీ చెహ్రా నహీం దిఖాయా. (తన పవిత్రతను కాపాడుకోవడానికి అల్లావుద్దీన్ ఖిల్జీకి తన ముఖాన్ని ఎప్పుడూ చూపించని రాణి పద్మావతి).

"ఆమె 16,000 రాణీవాసపు స్త్రీలతో కలిసి తనను తాను మంటలకు ఆహుతి చేసుకుంది. కానీ మీ ప్రభుత్వం ఆ స్థలం చుట్టూ అడ్డంకులు పెట్టింది. మా ప్రభుత్వం ఇప్పుడు ఈ సైట్‌ను గుర్తించింది’’ అని అన్నారు.

ఆయన వ్యాఖ్యలతో ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ వెల్ లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు.

ప్రతిపక్ష సభ్యులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుప్రియా సూలే, ద్రవిడ మున్నేట్ర కజగం ఎంపీ కనిమొళి, దయానిధి మారన్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎ. రాజా, కె. మురళీధరన్, AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్ తదితరులు బీజేపీ ఎంపీ జోషి 'సతి' ఆచారాన్ని కీర్తించారని పేర్కొన్నారు.

అయితే, తాను ‘సతి’ ఆచారం గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదని, పద్మావతి తన గౌరవాన్ని కాపాడేందుకు ‘జౌహర్’ (స్వయం దహనం) చేసుకుందని మాత్రమే చెప్పానని జోషి పేర్కొన్నారు.

First Published:  8 Feb 2023 11:47 AM GMT
Next Story