Telugu Global
National

కర్నాటక ఎన్నికలు: కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నిలబెట్టిన మహిళా అభ్యర్థులు 5 శాతం మాత్రమే

మే 10 వ తేదీన కర్నాటకలో జరగనున్న ఎన్నికల కోసం ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఏస్ లు 5 శాతం మాత్రమే మహిళా అభ్యర్థులకు టిక్కట్లు ఇచ్చాయి. మొత్తం 224 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 11 మందికి, బీజేపీ 12 మందికి, జేడీఎస్ తన భాగస్వామ్య పక్షాలతో కలిసి 13 మంది మహిళలకు మాత్రమే టిక్కట్లు ఇచ్చాయి.

కర్నాటక ఎన్నికలు: కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నిలబెట్టిన మహిళా అభ్యర్థులు 5 శాతం మాత్రమే
X

మే 10 వ తేదీన కర్నాటకలో జరగనున్న ఎన్నికల కోసం ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఏస్ లు 5 శాతం మాత్రమే మహిళా అభ్యర్థులకు టిక్కట్లు ఇచ్చాయి. మొత్త 224 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 11 మందికి, బీజేపీ 12 మందికి, జేడీఎస్ తన భాగస్వామ్య పక్షాలతో కలిసి 13 మంది మహిళలకు మాత్రమే టిక్కట్లు ఇచ్చాయి.మహిళలకు లోక్ స‌భ, రాష్ట్ర శాసనసభలలో 33 శాతం సీట్ల రిజర్వేషన్లు ఇస్తామంటూ ప్రతి రాజకీయ పార్టీ హామీ ఇస్తోంది. వారి పార్టీ మహాసభల్లో ఈ మేరకు తీర్మానాలు చేస్తోంది. కానీ ఆచరణలో అన్ని పార్టీలు మహిళల పట్ల చిన్నచూపే ప్రదర్శిస్తున్నాయి.

2010లో రాజ్యసభలో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ముప్పై మూడు శాతం కోటా ప్రతిపాదించారు. కానీ ఆ బిల్లు ఇప్పటి వరకు లోక్‌సభలో ఓటింగ్ కు రాలేదు. అప్పటి నుండి కోల్డ్ స్టోరేజీలోనే ఉంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోయినా తాము మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్ని పార్టీల అగ్రనాయకులు వేదికల మీద ఉపన్యాసాలు దంచుతారు. ఎన్నికలొచ్చినప్పుడు వారి అసలు రూపు బైటపడుతుంది.

మే 10 వ తేదీన కర్నాటకలో జరగనున్న ఎన్నికల కోసం ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఏస్ లు 5 శాతం మాత్రమే మహిళా అభ్యర్థులకు టిక్కట్లు ఇచ్చాయి. మొత్త 224 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 11 మందికి, బీజేపీ 12 మందికి, జేడీఎస్ తన భాగస్వామ్య పక్షాలతో కలిసి 13 మంది మహిళలకు మాత్రమే టిక్కట్లు ఇచ్చాయి.

అంటే మూడు పార్టీలకు కలిపి మొత్తం అభ్యర్థుల సంఖ్యలో మహిళల అభ్యర్థులు దాదాపు 5 శాతం.

వివిధ పార్టీల మహిళా నాయకుల అభిప్రాయం ప్రకారం, మూడు పార్టీలు లింగ సమానత్వాన్ని సాధించడం కంటే కులం, గెలిచే అభ్యర్థులు,అభ్యర్థుల స్థానిక సమీకరణాలపై దృష్టి పెట్టాయి.

కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొమ్మనహళ్లి నియోజకవర్గం నుండి టికెట్ ఆశించిన కవితా రెడ్డి తనకు టిక్కట్ నిరాకరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మహిళలకు జరిగిన అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ మహిళా మోర్చా కర్ణాటక యూనిట్ అధ్యక్షురాలు పుష్పా అమర్‌నాథ్ మాట్లాడుతూ, “మహిళల కోటాలో మహిళలకు టిక్కెట్లు కల్పించడం గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఇప్పుడు ముఖ్యమైన విషయం. ” అన్నారు

పుష్పా అమర్‌నాథ్ కూడా టికెట్ ఆశించారు, అయితే ఎక్కువ మంది పురుషులతో కూడిన కాంగ్రెస్ నాయకత్వం ఆమెను రంగంలోకి దింపడానికి నిరాకరించింది. "మహిళల రిజర్వేషన్ బిల్లు లేకుండా, మహిళలకు ఎక్కువ టిక్కెట్లు వస్తాయని మేము ఆశించలేము" అని ఆమె అంగీకరించింది.

బీజేపీ మహిళా నాయకులు కూడా ఇదే విధమైన నిరాశ‌ను వ్యక్తం చేశారు.33 శాతం రిజర్వేషన్లు అమలు కానంత వరకు ఇదే పరిస్థితి ఉంటుందని బీజేపీ కర్ణాటక మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా వివేకానంద అన్నారు.

“వారు (పార్టీ నిర్ణయాధికారులు) ఎల్లప్పుడూ కులం, గెలిచే అభ్యర్థిని చూస్తారు. ఇది పురుషాధిక్య సమాజం. వారికి గెలుపు తప్ప మరేమీ కనిపించదు. రిజర్వేషన్ వచ్చే వరకు ఇది తప్పదు.'' అన్నారామె.

"మహిళల‌ను పార్టీ పెద్ద ఎత్తున నాయకులుగా తీర్చిదిద్దుతుంది. అయితే టిక్కెట్ పంపిణీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం, లింగం కాకుండా ఇతర పారామీటర్లకు ప్రాధాన్యత ఉంటుంది" అని ఆమెఅన్నారు.

కాగా, రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు మొత్తం 2,613 మంది అభ్యర్థులను బరిలోకి దించగా, అందులో 185 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం 11 మంది మహిళా శాసనసభ్యులు ఉన్నారు, వీరిలో ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు బిజెపి, ఒకరు జెడి(ఎస్), ఒకరు నామినేటెడ్ సభ్యురాలు. కర్నాటకలో ఇంతవరకు మహిళా ముఖ్యమంత్రి లేరు.

ఈ ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో "విద్య, ఉద్యోగాలలో మహిళలకు సమాన అవకాశాల కల్పనకు, వారి సామాజిక-రాజకీయ-ఆర్థిక సాధికారతకు కట్టుబడి ఉంది" అని తీర్మానాన్ని ఆమోదించింది.

పైగా“మేము 33 శాతం రిజర్వేషన్లు కోరుతూ బిల్లును ఆమోదించడానికి ప్రయత్నిస్తాము .'' అని పేర్కొంది.

2014 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ రూపొందించిన మేనిఫెస్టోలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపారు.

"రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలలో 33 శాతం (మహిళలకు) రిజర్వేషన్లకు బిజెపి కట్టుబడి ఉంది." అని పేర్కొన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ రూపొందించిన మేనిఫెస్టోలో కూడా బీజేపీ ఇదే విషయాన్ని చెప్పింది.

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గత 25 ఏళ్లలో ఎన్నికైన మొత్తం 21,161 మంది ఎమ్మెల్యేలలో (తిరిగి ఎన్నికైన వారు ప్రతిసారీ విడిగా లెక్కించబడతారు), కేవలం 1,584 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే ఈ సమయంలో ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేలలో 8 శాతం మాత్రమే మహిళలు. 92 శాతానికి పైగా పురుషులే.

1998 , 2023 మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికైన మహిళల సగటు నిష్పత్తి 7నుంచి9 శాతం మాత్రమే ఉంది.

First Published:  1 May 2023 2:32 PM GMT
Next Story