Telugu Global
National

ఛీఫ్ జస్టిస్ పైనే ట్రోలింగ్.... బీజేపీ దళాల పనే అని ఆరోపణలు

మహారాష్ట్ర శివసేనలో చీలిక తెచ్చి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయం తెలిసిందే. ఆ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ సాగుతోంది. ఈ అంశంలో గవర్నర్ కోశ్యారీ తీరుపై ఛీఫ్ జస్టిస్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారంనాడు పలు వ్యాఖ్యలు చేసింది. ఏ ప్రభుత్వాన్నైనా దించేసేందుకు గవర్నర్లు తొందరపడొద్దని వ్యాఖ్యానించింది.

ఛీఫ్ జస్టిస్ పైనే ట్రోలింగ్.... బీజేపీ దళాల పనే అని ఆరోపణలు
X

సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు ఎవరూ అతీతులు కాదు. రాజకీయ నాయకులు, వ్యక్తిగత శత్రువులు, సినిమా నటీ నటులు, మహిళలు...ఇలా ఎంతో మందిపై కొన్ని సోషల్ మీడియా గుంపులు దాడులు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏకంగా భారత్ సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ పైనే కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. తమ రాజకీయ బాస్ లకు నచ్చని కామెంట్లు చేసినందుకు సోషల్ మీడియా టీంలు ఛీఫ్ జస్టిస్ DY చంద్రచూడ్ ను టార్గెట్ చేసుకున్నాయి.

మహారాష్ట్ర శివసేనలో చీలిక తెచ్చి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయం తెలిసిందే. ఆ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ సాగుతోంది. ఈ అంశంలో గవర్నర్ కోశ్యారీ తీరుపై ఛీఫ్ జస్టిస్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారంనాడు పలు వ్యాఖ్యలు చేసింది. ఏ ప్రభుత్వాన్నైనా దించేసేందుకు గవర్నర్లు తొందరపడొద్దని వ్యాఖ్యానించింది. పార్టీ అంతర్గత కలహాల సమస్య వచ్చినప్పుడు గవర్నర్ విచక్షణతో వ్యవహరించాలని కూడా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. గవర్నర్ ఇలాంటి చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి అంతమంచిది కాదని కామెంట్ చేసింది.

Advertisement

ఇక సుప్రీం కోర్టు వ్యాఖ్యానాలు బైటికి వచ్చాయో లేదో సోషల్ మీడియాలో ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పై ట్రోలింగ్ మొదలైంది. ఒకరో ఇద్దరో చేసిన ట్రోలింగ్ కాదిది. ఆర్గనైజ్డ్ గా వందలాది మంది సీజేఐ పై చెప్పరాని మాటలతో దాడులు చేశారు. ఈ ట్రోలింగ్ లు ఎవరు చేస్తున్నారో కొద్దిగా ఆలోచిస్తే అర్దమైపోతుంది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు, మేదావులు, న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. ఇలా ఛీఫ్ జస్టిస్ పై ట్రోలింగ్ లకు పాల్పడటం తీవ్రమైన చర్య అని మండిపడ్డారు. దేశ ప్రధాన న్యాయమూర్తికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇది బీజేపీ సోషల్‌ మీడియా పనేనని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

ఈ విషయంలో 13 మంది ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖలు రాశారు. భారత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్‌ను ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ చేయడంపై తక్షణమే చర్య తీసుకోవాలని అభ్యర్థించారు.

“మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, గవర్నర్ పాత్ర విషయంలో ఒక ముఖ్యమైన రాజ్యాంగ సమస్యను గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోందని మనందరికీ తెలుసు. విషయం సబ్ జ్యూడీస్ అయితే, మహారాష్ట్రలోని అధికార పార్టీ ప్రయోజనాలకు సానుభూతి చూపే ట్రోల్ ఆర్మీ గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా దాడిని ప్రారంభించింది. చాలా హీనమైన భాష ఉపయోగిస్తూ దాడి చేస్తున్నారు. వీరిపై తక్షణంచర్యలు తీసుకోవాలి. ”అని కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా తన‌ లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖాతో సహా ఎంపీలు దిగ్విజయ సింగ్, శక్తిసిన్హ్ గోహిల్, ప్రమోద్ తివారీ, అమీ యాగ్నిక్, రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా, శివసేన (యుబిటి) సభ్యులు ప్రియాంక చతుర్వేది, సమాజ్‌వాది పార్టీ సభ్యులు జయా బచ్చన్ , రామ్ గోపాల్ యాదవ్ లు రాష్ట్రపతికి లేఖలు రాశారు. ఇదే అంశంపై అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి కూడా రాష్ట్రపతికి విడిగా లేఖ రాశారు.

Next Story