Telugu Global
National

ఒడిశా మాజీ సీఎం గమాంగ్,అతని కుమారుడు శిశిర్ బీజేపీకి రాజీనామా... త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరిక!

తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన గిరిధర్ గామాంగ్, అతని కుమారుడు శిశిర్ జనవరి 13న హైదరాబాద్‌లో BRS ప్రెసిడెంట్, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి అనేక గంటలపాటు చర్చలు జరిపారు. ఆ నేపథ్యంలోనే ఈ రాజీనామా పరిణామం జరిగింది.

ఒడిశా మాజీ సీఎం గమాంగ్,అతని కుమారుడు శిశిర్ బీజేపీకి రాజీనామా... త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరిక!
X

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ బీజేపీకి రాజీనామా చేశారు. వీరిద్దరూ త్వరలో కేసీఆర్ నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితిలో చేరే అవకాశం ఉంది.

భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. వారు తమ రాజీనామా లేఖలను బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాకు పంపినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. “గత కొన్ని సంవత్సరాలుగా ఒడిశాలోని నా ప్రజల ల కోసం ఏమీ చేయలేక పోతున్నాను. ప్రజలపట్ల రాజకీయ, సామాజిక, నైతిక బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నానని నేను గ్రహించాను. అందుకే, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను. దయచేసి దానిని ఆమోదించండి” అని మాజీ ముఖ్యమంత్రి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన గిరిధర్ గామాంగ్, అతని కుమారుడు శిశిర్ జనవరి 13న హైదరాబాద్‌లో BRS ప్రెసిడెంట్, తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి అనేక గంటలపాటు చర్చలు జరిపారు. ఆ నేపథ్యంలోనే ఈ రాజీనామా పరిణామం జరిగింది.2024 ఎన్నికలలో పార్టీని నడిపించడానికి BRS గిరిధర్ గామాంగ్ ను ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఆ ఎన్నికల్లో BRS టిక్కెట్‌పై శిశిర్ పోటీ చేసే అవకాశం ఉంది.

BRSలో చేరడం గురించి గిరిధర్ గమాంగ్ ఇలా అన్నారు: “నేను ఒక జాతీయ పార్టీ (కాంగ్రెస్) నుండి మరొక జాతీయ పార్టీ అయిన బిజెపికి వచ్చాను.ఇప్పటి వరకు ఒడిశాలో అడుగు పెట్టని మరో జాతీయ పార్టీలో నేను చేరతాను.'' అని అన్నారు.

వయసు పెద్దది కావడం వల్ల తాను ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని, తన కొడుకు శిశిర్ పోటీ చేస్తాడని గిరిధర్ గామాంగ్ చెప్పారు.

బీజేపీకి రాజీనామా చేయాల్సి వచ్చిన పరిస్థితుల గురించి వివరించిన‌ తండ్రీ కొడుకులిద్దరూ కూడా బీజేపీలో తమకు సహించలేని అవమానం జరిగిందన్నారు.

First Published:  26 Jan 2023 3:05 AM GMT
Next Story