Telugu Global
National

ఒడిశా రైలు ప్రమాదం : మూడు నెలల ముందే అధికారి హెచ్చరికలు

కొన్నాళ్లపాటు ఈ వ్యవస్థను నిలిపివేయాలని ఆయన సూచించారు. ఇంటర్ లాకింగ్ సిస్టంలో లోపాలు ఉన్నందువల్ల రైలు బయలుదేరిన తర్వాత ప్రయాణించవలసిన రూట్ మారిపోతోందని ఆయన ఆ లేఖలో హెచ్చరించారు.

ఒడిశా రైలు ప్రమాదం : మూడు నెలల ముందే అధికారి హెచ్చరికలు
X

ఒడిశాలోని బాలసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న సంఘటనలో వందలాదిమంది ప్రయాణికులు మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రమాదం వెనుక గల నిర్లక్ష్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాలసోర్ రూట్ లో సిగ్నల్ వ్యవస్థలోని లోపం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని మూడు నెలల కిందటే ఓ అధికారి రైల్వే ఉన్నతాధికారులను హెచ్చరించారు. అప్పుడే అధికారులు అప్రమత్తమై ఉంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హరిశంకర్ వర్మ అనే రైల్వే అధికారి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు ఆయన పశ్చిమ మధ్య రైల్వేలో పని చేశారు. ఆ సమయంలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ గా ఆయన విధులు నిర్వహిస్తుండగా.. దక్షిణ పశ్చిమ రైలులో ఒక సంఘటన జరిగింది. ఒక ట్రైన్ మరొక లైన్లోకి వెళ్ళింది. ఈ ఘటనకు సంబంధించి పరిశీలన జరిపిన హరి శంకర్ ఇంటర్ లాకింగ్ కోసం రూపొందించిన వ్యవస్థను బైపాస్ గా మార్చినప్పుడు లొకేషన్ బాక్స్ లో సమస్య తలెత్తినట్లు గుర్తించారు.

దీని గురించి రైల్వే ఉన్నతాధికారులకు వర్మ లేఖ రాశారు. కొన్నాళ్లపాటు ఈ వ్యవస్థను నిలిపివేయాలని ఆయన సూచించారు. ఇంటర్ లాకింగ్ సిస్టంలో లోపాలు ఉన్నందువల్ల రైలు బయలుదేరిన తర్వాత ప్రయాణించవలసిన రూట్ మారిపోతోందని ఆయన ఆ లేఖలో హెచ్చరించారు. అయితే రైల్వే బోర్డు అధికారులు హరిశంకర్ చేసిన సూచనలను పట్టించుకోలేదు. ఒకవేళ హరిశంకర్ సూచనలను వారు పాటించినట్లయితే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  6 Jun 2023 11:04 AM GMT
Next Story