Telugu Global
National

UPI లావాదేవీలపై ఛార్జీలు లేవు కేంద్రం క్లారిటీ

UPI లావాదేవీలపై చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. UPI ద్వారా చేసే చెల్లింపులపై క్రమంగా ఛార్జీలు విధించే అవకాశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన వాటా దారులను అభిప్రాయాలు కోరిన నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది.

UPI లావాదేవీలపై ఛార్జీలు లేవు కేంద్రం క్లారిటీ
X

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా చెల్లింపులు చేయడానికి ఎటువంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని కేంద్రం ఆదివారం తెలిపింది. డిజిటల్ బ్యాంకు లావాదేవీలపై (UPI) కేంద్ర ప్రభుత్వం ఛార్జీలు విధించనున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ క్లారిటీ ఇచ్చింది.

''UPI ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసింది. UPI సేవలకు ఛార్జీలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కాస్ట్ రికవరీ కోసం సర్వీస్ ప్రొవైడర్లు ఇతర మార్గాలు అన్వేషించుకోవాలి .'' అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.

UPI ద్వారా చేసే చెల్లింపులపై క్రమంగా ఛార్జీలు విధించే అవకాశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన వాటా దారులను అభిప్రాయాలు కోరిన నేపథ్యంలో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. దాంతో రంగంలోకి దిగిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విషయాన్ని స్పష్టం చేసింది.

First Published:  22 Aug 2022 3:09 AM GMT
Next Story