Telugu Global
National

కౌగిలింతలు కాన్సిల్... 'కౌ హగ్ డే'పై వెనక్కి తగ్గిన‌ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు

తాజా నోటీసులో, బోర్డు ఇలా పేర్కొంది, “ ఫిషరీస్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2023 ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంది."

కౌగిలింతలు కాన్సిల్... కౌ హగ్ డేపై వెనక్కి తగ్గిన‌ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు
X

ఫిబ్రవరి 14ని 'కౌ హగ్ డే'గా జరుపుకోవాలని ఆవు ప్రేమికులను కోరుతూ చేసిన విజ్ఞప్తిని ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు ఉపసంహరించుకుంది.

తాజా నోటీసులో, బోర్డు ఇలా పేర్కొంది, “ ఫిషరీస్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2023 ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంది. ."

ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే ఫిబ్రవరి 14న ఆవులను కౌగిలించుకోవాలని ఆవు ప్రేమికులకు విజ్ఞప్తి చేస్తూ AWBI గతంలో నోటీసు జారీ చేసింది "ఇది గొప్ప భావోద్వేగాన్ని కలుగజేస్తుంది.వ్యక్తిగతంగా, సామూహికంగ గొప్ప‌ ఆనందాన్నిస్తుంది" అని అప్పటి తన నోటీసులో బోర్డు పేర్కొంది.

"పాశ్చాత్య నాగరికత, సంస్కృతి ఆకర్షణ మూలంగా కాలక్రమేణా వైదిక సంప్రదాయాలు దాదాపుగా అంతరించిపోయే దశలో ఉన్నాయి" అని తన నోటీసులో పేర్కొంది. భారతీయ సంస్కృతికి ఆవు వెన్నెముక అని వర్ణించింది.

అయితే ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు నోటీసు జారీ చేసిన తర్వాత ఈ 'కౌ హగ్ డే' పై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో ఈ నోటీసుపై దాడి చేస్తూ హాస్యభరితమైన వేలాది మీమ్స్ వెల్లువెత్తాయి. ఆవుకు లేని ప్రయోజనాలను అంటగడుతున్నారంటూ కొందరు నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఈ నెల 14 న ఆవుతో కౌగిలింతలను ఏనిమల్ వెల్ఫేర్ బోర్డు రద్దు చేసింది.

First Published:  10 Feb 2023 1:00 PM GMT
Next Story