Telugu Global
National

ఆ సెక్షన్ కింద‌ పెట్టిన కేసులన్నింటినీ రద్దుచేయండి ‍-సుప్రీం కోర్టు ఆదేశాలు

ఐటి చట్టం లోని సెక్షన్ 66A ను సుప్రీం కోర్టు రద్దు చేసి ఆరేళ్ళయ్యింది. ఆ సెక్షన్ కింద నమోదు చేసిన కేసులను తొలగించాలని, ఇకపైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయవద్దని ఆరేళ్ళ కిందటనే సుప్రీం కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ పోలీసులు ఆ ఆదేశాలను పాటించకపోవడం పట్ల బుధవారం నాడు సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆ సెక్షన్ కింద‌ పెట్టిన కేసులన్నింటినీ రద్దుచేయండి ‍-సుప్రీం కోర్టు ఆదేశాలు
X

2015లోనే సుప్రీంకోర్టు కొట్టివేసిన ఐటి చట్టం 2000లోని సెక్షన్ 66A కింద ఇప్పటికీ కేసులు నమోదు చేయడం పట్ల సుప్రీం కోర్టు సీరియస్ గా స్పందించింది. ఆ సెక్షన్ కింద పౌరులెవరినీ ప్రాసిక్యూట్ చేయరాదని ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి యు.యు. లలిత్, న్యాయమూర్తులు ఎస్. రవీంద్ర భట్, అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం ఈ రోజు ఈ అంశంపై విచారణ జరిపింది. శ్రేయా సింఘాల్ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఈ సెక్షన్ ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చినప్పటికీ సెక్షన్ 66ఏ ఐటీ చట్టం ఇప్పటికీ ప్రయోగించబడుతుందనే అంశాన్ని పేర్కొంటూ పౌరహక్కుల సంఘం (PUCL) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.

సెక్షన్ 66A ఉల్లంఘనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదును నమోదు చేయవద్దని పోలీసు బలగాలను ఆదేశించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల డైరెక్టర్ జనరల్ (డీజీపీలు)లు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల హోం సెక్రటరీలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అధికారులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటి వరకు ఆ సెక్షన్ కింద నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని, ఇకపైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయవద్దని ఆరేళ్ళ కిందటనే సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు ఆ ఆదేశాలను పాటించకపోవడం పట్ల ధర్నాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

.

First Published:  12 Oct 2022 2:26 PM GMT
Next Story