Telugu Global
National

హిందూ పండగలపై సెటైర్లా..? స్విగ్గీపై నెటిజన్ల ఆగ్రహం

హిందువుల పండుగలపై సెటైర్లు వేయడం ప్రతి ఒక్కరికి కామన్ గా మారిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్విగ్గీపై ఫైర్ అయ్యారు

హిందూ పండగలపై సెటైర్లా..? స్విగ్గీపై నెటిజన్ల ఆగ్రహం
X

హోలీ సందర్భంగా ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ చేసిన ఒక ప్రకటన వివాదాస్పదంగా మారింది. దీంతో ఇండియాలో స్విగ్గీని బ్యాన్ చేయాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సమయంలో ప్రత్యేక ప్రకటనలు ఇవ్వడం స్విగ్గీ సంస్థకు అలవాటు. హోలీ సందర్భంగా కూడా ఢిల్లీలో స్విగ్గీ ఓ బిల్ బోర్డు ఏర్పాటు చేసింది. ఆ బోర్డులో రెండు కోడిగుడ్లు పక్కపక్కనే పెట్టి గుడ్లను ఆమ్లెట్ వేసుకోవడానికి వినియోగించండి.. కానీ, ఎవరి తల మీద కొట్టడానికి కాదు.. అని కొటేషన్స్ రాసింది.

స్విగ్గీ ఫన్నీగా ప్రకటన చేసినప్పటికీ దీనిపై హిందూ సంఘాలు, హిందుత్వ మద్దతుదారులు స్విగ్గీ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సంస్థ ప్రచారం కోసం హిందూ పండుగలను అవమానించవద్దు.. అంటూ హెచ్చరికలు చేశారు. హోలీ పండుగను అవమానించినందుకు వెంటనే ప్రజలకు స్విగ్గీ సంస్థ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


హిందువుల పండుగలపై సెటైర్లు వేయడం ప్రతి ఒక్కరికి కామన్ గా మారిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్విగ్గీపై ఫైర్ అయ్యారు. ఈద్ సందర్భంగా మేకలను వధించవద్దని ముస్లింలకు, క్రిస్మస్ సందర్భంగా చెట్లను నరక వద్దని క్రైస్తవులకు ఇలాగే సూచనలు చేసే దమ్ము మీకుందా..? అని స్విగ్గీని ప్రశ్నించారు. స్విగ్గీ చేసిన పనిని వ్యతిరేకిస్తూ పలువురు నెటిజన్లు ఆ సంస్థను బాయ్ కాట్ చేయాలని ట్విట్టర్ లో ఓ హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు.

అలాగే పలువురు తమ స్మార్ట్ ఫోన్లలో స్విగ్గీ యాప్ ని అన్ ఇన్ స్టాల్ చేసి అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఢిల్లీలో పెట్టిన బిల్ బోర్డు ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో స్విగ్గీ సంస్థ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఆ బిల్ బోర్డును మాత్రం అక్కడి నుంచి తొలగించింది.

First Published:  8 March 2023 2:59 AM GMT
Next Story