Telugu Global
National

అజిత్ ప‌వార్‌నుద్దేశించి శ‌ర‌ద్ ప‌వార్ కీల‌క వ్యాఖ్య‌లు

తన ఫొటోను ఎవరు ఉపయోగించుకోవాలో నిర్ణయించే హక్కు తనకు ఉందని చెప్పారు. త‌న‌ భావజాలాన్ని వ్యతిరేకించేవారు, త‌న‌తో సిద్ధాంతపరంగా విభేదించిన‌వారు త‌న‌ ఫొటోను వాడొద్ద‌ని శరద్ పవార్ స్ప‌ష్టం చేశారు.

అజిత్ ప‌వార్‌నుద్దేశించి శ‌ర‌ద్ ప‌వార్ కీల‌క వ్యాఖ్య‌లు
X

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత అజిత్ ప‌వార్ బీజేపీ-శివసేన ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు తెలప‌డంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ మంగ‌ళ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తనకు నమ్మక ద్రోహం చేసిన వాళ్లు తన ఫొటో వాడుకోవ‌ద్ద‌ని స్పష్టం చేశారు. పార్టీకి జాతీయ అధ్యక్షుడినైన తాను, రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ మాత్రమే త‌న‌ ఫొటో ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. తన ఫొటోను ఎవరు ఉపయోగించుకోవాలో నిర్ణయించే హక్కు తనకు ఉందని చెప్పారు. త‌న‌ భావజాలాన్ని వ్యతిరేకించేవారు, త‌న‌తో సిద్ధాంతపరంగా విభేదించిన‌వారు త‌న‌ ఫొటోను వాడొద్ద‌ని శరద్ పవార్ స్ప‌ష్టం చేశారు.

అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత శరద్ పవార్ ఈ విధంగా స్పందించారు. ఎన్సీపీ నేత అజిత్ ప‌వార్‌తో పాటు మ‌రో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ-శివ‌సేన ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు తెలిపిన విష‌యం తెలిసిందే. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా, మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ పరిణామాలతో ఎన్సీపీ రెండుగా చీలిపోయినట్లయ్యింది. అనంతరం తమదే అసలైన ఎన్సీపీ అంటూ ఇరు వర్గాలూ ప్రకటించుకున్నాయి. ఈ క్రమంలో ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జయంత్ పాటిల్‌ను తొలగిస్తున్నట్టు అజిత్ వర్గం పేర్కొనగా.. అజిత్ తో పాటు ఆయనతో వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు జయంత్ పాటిల్ విజ్ఞప్తి చేయడం గమనార్హం.

First Published:  5 July 2023 2:32 AM GMT
Next Story