Telugu Global
National

బీజేపీకి సంబంధించి లక్ష పేజీల కాల్ డేటా..!

ఈ లక్ష పేజీల కాల్ డేటాను ప్రత్యేక నిపుణుల ద్వారా విశ్లేషిస్తున్నారని వెల్లడించింది. ఈడేటా విశ్లేషణకు దేశంలోనే అనేక మంది ఐటీ నిపుణులు ముందుకొస్తున్నట్టు వివరించింది.

బీజేపీకి సంబంధించి లక్ష పేజీల కాల్ డేటా..!
X

దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు.. బీజేపీ పెద్దలకు మోకరిల్లినా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రం తగ్గడం లేదు. బీజేపీని కేసీఆర్ ఢీకొడుతున్న తీరు చాలా మందికి ధైర్యాన్ని ఇస్తోంది. తమ నాయకులు కూడా ఇలాగే పోరాడితే బీజేపీ మెడలు వంచడం ఎందుకు సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని పలు పార్టీల వారు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోళ్ల కోసం వచ్చిన బ్రోకర్ల ఆడియో, వీడియో టేపులను బయటపెట్టి కేసీఆర్.. బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. అంతటితో అయిపోలేదంటోంది టీఆర్‌ఎస్. తాజాగా నమస్తే తెలంగాణ పత్రికలో ఒక కీలకమైన అంశం ప్రచురితమైంది. కమల్‌ ఫైల్స్‌కు సంబంధించి ఏకంగా లక్ష పేజీల కాల్‌ డేటా ఉన్నట్టు ఆ పత్రిక తనకున్న సమాచారం ఆధారంగా ప్రచురించింది.

ఈ లక్ష పేజీల కాల్ డేటాను ప్రత్యేక నిపుణుల ద్వారా విశ్లేషిస్తున్నారని వెల్లడించింది. ఈడేటా విశ్లేషణకు దేశంలోనే అనేక మంది ఐటీ నిపుణులు ముందుకొస్తున్నట్టు వివరించింది. ఈ లక్ష పేజీల కాల్‌ డేటాలో బీజేపీకి సంబంధించిన అనేక కుంభకోణాల సమాచారం కూడా ఉన్నట్టు విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా నమస్తే తెలంగాణ ప్రతిక ప్రచురించింది.

First Published:  5 Nov 2022 4:04 AM GMT
Next Story