Telugu Global
National

స‌ల్మాన్‌కు డెడ్‌లైన్‌..! - ఈ నెల 30న చంపేస్తామ‌ని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ కాల్‌

ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన అత‌ను త‌న‌ను రాకీభాయ్‌గా ప‌రిచయం చేసుకుని.. త‌న‌ది రాజ‌స్తాన్‌లోని జోధ్‌పూర్ అని చెప్పాడట‌. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

స‌ల్మాన్‌కు డెడ్‌లైన్‌..!    - ఈ నెల 30న చంపేస్తామ‌ని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ కాల్‌
X

న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ ఇటీవ‌ల బెదిరింపు కాల్స్ రావ‌డం తెలిసిందే. గ‌త నెల‌లోనే రెండు సార్లు ఈ కాల్స్ వ‌చ్చాయి. తాజాగా మ‌రోసారి ఇలాంటి కాల్ వ‌చ్చింది. ఈసారి డెడ్‌లైన్ కూడా విధించాడు నిందితుడు. ఈ నెల 30న స‌ల్మాన్ ఖాన్‌ని చంపేస్తాన‌ని బెదిరించాడు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన అత‌ను త‌న‌ను రాకీభాయ్‌గా ప‌రిచయం చేసుకుని.. త‌న‌ది రాజ‌స్తాన్‌లోని జోధ్‌పూర్ అని చెప్పాడట‌. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

స‌ల్మాన్ ఖాన్ ఇంటి వ‌ద్ద పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. 2018లో కృష్ణ‌జింక‌ల‌ను వేటాడిన కేసు విచార‌ణను ఎదుర్కొన్న స‌ల్మాన్‌ఖాన్‌ను గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే బెదిరించ‌డం తెలిసిందే. పంజాబ్ సింగ‌ర్ సిద్ధూ మూసేవాలాను చంపిన‌ట్టే సల్మాన్‌ను కూడా చంపేస్తామ‌ని బిష్ణోయ్ స‌న్నిహితుడు బెదిరింపుల‌కు దిగ‌డం గ‌మ‌నార్హం.

బెదిరింపుల నేప‌థ్యంలో స‌ల్మాన్ ఖాన్ క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ బ‌య‌టికి వెళ్తున్నారు. ఇటీవ‌ల హై సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు. తాజా బెదిరింపులు.. డెడ్‌లైన్ నేప‌థ్యంలో పోలీసు శాఖ పూర్తి స్థాయిలో అప్ర‌మ‌త్త‌మ‌వుతోంది.

First Published:  11 April 2023 8:58 AM GMT
Next Story