Telugu Global
National

షేరింగ్ ఆటోల్లో మహిళల భద్రత కోసం.. ‘టచ్ మీ నాట్’

ప్రతిరోజూ షేరింగ్ ఆటోల్లో ప్రయాణించే మహిళల్లో భద్రతా భావాన్ని పెంచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా శశాంక్ రావు చెప్పారు. కనీసం 40 వేల ఆటోలు, 1.60 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఈ ప్రచార పరిధిలోకి రానున్నారు.

షేరింగ్ ఆటోల్లో మహిళల భద్రత కోసం.. ‘టచ్ మీ నాట్’
X

ముంబైలోని ఆటో రిక్షా మెన్ యూనియన్.. ప్రతిరోజు షేరింగ్ ఆటోల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. షేరింగ్ ఆటోలో ప్రయాణిస్తున్న స్త్రీలు ఎవరైనా తమ సహ ప్రయాణికుడు తమని అనుచితంగా తాకినట్టుగా లేదా అసభ్యంగా ప్రవర్తించినట్టుగా డ్రైవర్ కి చెబితే.. నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా స్పందించేలా డ్రైవర్లకు అవగాహన కల్పించాలని యూనియన్ నిర్ణయించింది.

ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ అలాంటి ఫిర్యాదు చేసినప్పుడు డ్రైవర్.. నిందితుడైన వ్యక్తిని ఆటో నుంచి కిందకి దింపేయాలని, మహిళ కోరుకుంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి తనే తీసుకుని వెళ్లాలని, తాము డ్రైవర్లను కోరుతున్నామని యూనియన్ నాయకుడు శశాంక్ రావు తెలిపారు. ‘టచ్ మీ నాట్’ అనే పేరుతో రెడియో సిటీ.. ఎఫ్ ఎమ్ రేడియో ద్వారా ఈ అంశాలను జనంలోకి తీసుకు వెళ్తామ‌న్నారు.

ప్రతిరోజూ షేరింగ్ ఆటోల్లో ప్రయాణించే మహిళల్లో భద్రతా భావాన్ని పెంచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా శశాంక్ రావు చెప్పారు. కనీసం 40 వేల ఆటోలు, 1.60 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఈ ప్రచార పరిధిలోకి రానున్నారు. నగర సరిహద్దు ప్రాంతాల్లో షేరింగ్ ఆటోలు తిరుగుతున్న రూట్లు వంద వరకు ఉన్నాయి. డ్రైవర్లకు యూనియన్ పదిహేను నుంచి పదహారు వరకు శిక్షణా క్యాంపులను నిర్వహిస్తుందని రావు తెలిపారు.

*

First Published:  6 Sep 2023 2:13 AM GMT
Next Story