Telugu Global
National

అదానీ స్కాం: పార్లమెంటు నుంచి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీకి ప్రయత్నించిన 18 విపక్ష‌ పార్టీలు... అడ్డుకున్న పోలీసులు

ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జేడీయీ, ఆర్జేడీ, శివసేన తదితర పార్టీలు పాల్గొన్నాయి.

అదానీ స్కాం: పార్లమెంటు నుంచి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీకి ప్రయత్నించిన 18 విపక్ష‌ పార్టీలు... అడ్డుకున్న పోలీసులు
X

ఈ రోజు పార్లమెంటు నుండి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేస్తుండగా ప్రతిపక్ష పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

అదానీ స్కాంపై సమగ్ర విచారణ జరపాలని కోరేందుకు ఈడీ కార్యాలయానికి వెళ్తున్న దాదాపు 18 పార్టీల ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.

144 సెక్షన్‌ అమల్లో ఉడటం వల్ల‌ ఎంపీల పాదయాత్రను అనుమతించలేదని పోలీసులు చెప్పారు.

పోలీసులు విపక్ష నేతలను ఈడీ కార్యాలయానికి వెళ్ళనివ్వకపోవడంతో వారంతా తిరిగి పార్లమెంట్‌ ప్రాంగణానికి చేరుకున్నారు.

''18 పార్టీల ప్రతిపక్ష ఎంపీలు అదానీ సమస్యపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు మెమోరాండం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటోంది ? పోలీసులు మమ్మల్ని విజయ్ చౌక్ వద్ద ఎందుకు నిలిపివేశారు?” అని ఖర్గే ప్రశ్నించారు. అదానీ సమస్యపై దర్యాప్తు కోసం మేము డిమాండ్ చేస్తూనే ఉంటాము అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జేడీయీ, ఆర్జేడీ, శివసేన తదితర పార్టీలు పాల్గొన్నాయి.

కాగా, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మార్చ్‌లో పాల్గొనలేదు. ''అందరితో కలిసి కాకుండా మేము ప్రత్యేకంగా మా నిరసనను తెలుపుతాము.''అని టిఎంసి నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. ఎల్పీజీ ధరల పెంపుపై పలువురు టీఎంసీ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఎదుట నినాదాలు చేశారు.

First Published:  15 March 2023 3:02 PM GMT
Next Story