Telugu Global
National

మనీలాండరింగ్ కేసులో చెన్నై కోర్టుకు సుజనా చౌదరి హాజరు

బీజేపీ నేత సుజనా చౌదరి మనీ లాండరింగ్ కేసులో ఇవ్వాళ్ళ చెన్నై కోర్టుకు హాజరయ్యారు. మూడు బ్యాంకుల నుంచి 363 కోట్ల‌ రుణం తీసుకుని ఎగ్గొట్టాడన్న‌ ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

మనీలాండరింగ్ కేసులో చెన్నై కోర్టుకు సుజనా చౌదరి హాజరు
X

బీజేపీ నేత సుజనాచౌదరిని మనీ లాండరింగ్ చట్టం వెన్నాడుతోంది..ఈ చట్టం కింద ఈడీ కేసు పెట్టిన నేపథ్యంలో ఆయన శుక్రవారం చెన్నై లోని ఆర్ధిక నేరాల విభాగం కోర్టుకు హాజరయ్యారు. మూడు బ్యాంకుల నుంచి రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ బ్యాంకుల నుంచి అందిన ఫిర్యాదులను పురస్కరించుకుని సీబీఐ ఇదివరకే కేసు పెట్టింది. సుజనా ఆధ్వర్యంలోని బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థ (చెన్నై) తమ బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి చెల్లించలేదని ఇవి ఫిర్యాదు చేశాయి. తమకు మోసపూరితమైన స్టేట్మెంట్లు, అకౌంట్లు సమర్పించినట్టు ఈ బ్యాంకులు పేర్కొన్నాయి. తమకు 363 కోట్ల రుణం అందవలసి ఉందని తెలిపాయి. .ఈ కంపెనీ..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 133 కోట్లు, ఆంధ్రా బ్యాంక్ నుంచి 71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి 159 కోట్ల అప్పు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా చెన్నైలోని ఈడీ కార్యాలయం మనీ లాండరింగ్ నివారణ చట్టం కింద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. దీంతో చెన్నైతో బాటు బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో ఉన్న ఈ సంస్థ ఆఫీసులకు సంబంధించి దర్యాప్తు చేబట్టింది.


2018 నుంచే సుజనా చుట్టూ ఈడీ కేసులు చుట్టుకున్నాయి. హైదరాబాద్, ఢిల్లీలోని ఆయన ఇళ్ళు, కార్యాలయాలపై అప్పట్లోనే మొత్తం 8 చోట్ల ఈడీ దాడులు చేసింది. రూ. 5,700 కోట్ల మేర మనీ లాండరింగ్ తోపాటు ఆర్ధిక సంబంధమైన ఇతర అవకతవకలు జరిగినట్టు ఈ సంస్థ గుర్తించింది. ఆయన ఆధ్వర్యంలోని డొల్ల కంపెనీలు కొన్ని .. ఆయా బ్యాంకులను ఫ్రాడ్ చేసినట్టు ఈడీ పేర్కొంది. ఈ గ్రూపు కంపెనీలపై ఫెమా, డీఆర్ఐ, సీబీఐ కేసులు నమోదై ఉన్నాయి.











First Published:  12 Aug 2022 8:55 AM GMT
Next Story