Telugu Global
National

మోర్బీ బాధితుల‌కు మోడీ ప‌రామ‌ర్శ‌.. సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఆసుత్రిలో అన్నీ సెట్టింగులే ..

గుజ‌రాత్ లోని మోర్బీలో వంతెన కూలిన ఘ‌ట‌న‌లో బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ప్ర‌ధాని మోడీ ఆస్ప‌త్రికి వెళ్ళారు. ఈ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఆస్ప‌త్రిలో అన్నీ డ్రామా సెట్టింగుల్లా అప్ప‌టిక‌ప్పుడు ఏర్పాటు చేశారు.

మోర్బీ బాధితుల‌కు మోడీ ప‌రామ‌ర్శ‌.. సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఆసుత్రిలో అన్నీ సెట్టింగులే ..
X

నాట‌కీయ ఫ‌క్కీలో ప్ర‌సంగాలతో అధినాయ‌కులు ప్ర‌జ‌ల‌ను యేమారుస్తూ మ‌భ్య పెడుతున్న‌ట్టుగానే ఆ ఆసుప‌త్రి అధికారులు కూడా ఏకంగా ప్ర‌ధానినే ఏమార్చేశారు. మ‌సిపూసి మారేడుకాయ చేశారు.

గుజ‌రాత్ లోని మోర్బీలో వంతెన కూలిన ఘ‌ట‌న‌లో బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ప్ర‌ధాని మోడీ ఆస్ప‌త్రికి వెళ్ళారు. ఈ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఆస్ప‌త్రిలో అన్నీ డ్రామా సెట్టింగుల్లా అప్ప‌టిక‌ప్పుడు ఏర్పాటు చేశారు.

గ్రౌండ్ ఫ్లోర్‌లో ఖాళీగా ఉన్న వార్డును అప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసి, తాజా బెడ్‌షీట్‌లతో కొత్త బెడ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొదటి అంతస్తులో ఉన్న గాయపడిన వారిలో కొందరిని ప్రధాని పర్యటన కోసం ప్ర‌త్యేకంగా తీసుకొచ్చి అక్క‌డ ఉంచారు. కొన్ని బెడ్‌షీట్‌లపై మోర్బీకి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న జామ్‌నగర్‌లోని ఆసుపత్రి గుర్తులు ఉన్నాయి. ఆ ఆసుప‌త్రిలో పాడుప‌డిన చందంగా ఉన్న గుర్తుల‌ను తొల‌గించేందుకు గోడ‌ల‌కు కొత్త రంగులు వేసి హంగూ ఆర్భాటం చేశారు. ఇదంత మోడీ సంద‌ర్శించే వార్డుకు మాత్ర‌మే. ఆ వార్డు లోప‌ల, బ‌య‌ట ట‌చ్ అప్ ల కోసం దాదాపు 40 మంది పెయింట‌ర్లు రాత్రంతా ప‌ని చేశారు. అలాగేమరుగుదొడ్లకు కొత్త టైల్స్ కూడా వచ్చాయి. ఆసుపత్రికి నాలుగు కొత్త వాటర్ కూలర్‌లు వచ్చాయి, ఆదివారం విషాదం జరిగినప్పటి నుండి, వాటిలో కొన్నింటికి సరఫరా కనెక్షన్లు లేవు.

ప్ర‌ధాని మోడీ తన సొంత రాష్ట్రంలో ఇంత విసాదం జ‌రిగినా స‌రైన రీతిలో స్పందించ‌లేద‌ని ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆప్, కాంగ్రెస్ పార్టీలు ధ్వ‌జ‌మెత్తాయి. ఆఖ‌రికి "మృతదేహాల విష‌యంలో కూడా స‌రైన శ్ర‌ద్ధ చూప‌కుండా అనాధ శ‌వాల్లా వ‌దిలేశార‌ని విమ‌ర్శించాయి. బ్రిటీష్ కాలం నాటి సస్పెన్షన్ బ్రిడ్జిని కంప్లీషన్ సర్టిఫికేట్ లేకుండా తిరిగి ఎలా ప్రారంభించారంటూ ప్ర‌త్య‌ర్ధి పార్టీలు బిజెపి ప్ర‌బుత్వాన్ని నిల‌దీశాయి. దీనిపై బిజెపి జ‌వాబు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాయి.

ఈ బ్రిడ్జిని మ‌రమ్మతుల కోసం కోసం మార్చి నుండి మూసివేసి గ‌త నెల 26వ తేదీన రీ ఓపెన్ చేశారు. తెరిచిన కేవ‌లం నాలుగు రోజులకే కూలిపోయి వంద‌లాది కుటుంబాల్లో పెను విషాదం నింపింది.

ఇప్పటివరకు, సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీ ఒరెవా గ్రూప్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. షెడ్యూల్ కంటే ముందే వంతెనను తెరవడం "తీవ్రమైన బాధ్యతారాహిత్యం, అజాగ్రత్తకు నిద‌ర్శ‌నం" అని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

నిర్వహణ , మరమ్మత్తుల కోసం వంతెనను 8 నుండి 12 నెలల వరకు మూసివేసేలా కంపెనీ తన ఒప్పందానికి కట్టుబడి ఉంది. ఇది తిరిగి తెరిచినప్పటి నుండి, టిక్కెట్లు ₹ 12 నుండి 17 వరకు విక్రయించారు. మోర్బిలోని వంతెన యొక్క పాత కేబుల్‌లలో కొన్నింటిని ఒరెవా గ్రూప్ ఏడు నెలల పునరుద్ధరణ సమయంలో మార్చలేదని వర్గాలు తెలిపాయి.

First Published:  1 Nov 2022 1:59 PM GMT
Next Story