Telugu Global
National

జమిలి ఎన్నికల అసలు వ్యూహమిదేనా?

అసలు జమిలి ఎన్నికలపై మోడీ ఎందుకింత పట్టుదలగా ఉన్నారు? ఎందుకంటే పార్లమెంటుతో పాటు దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోను బీజేపీ మాత్రమే అధికారంలో ఉండాలనేది మోడీ ఆలోచన.

జమిలి ఎన్నికల అసలు వ్యూహమిదేనా?
X

నరేంద్ర మోడీ కొంతకాలంగా జమిలి ఎన్నికల జపం చేస్తున్నారు. మోడీ ఆదేశాలతోనే కేంద్ర ఎన్నికల కమిషన్ దేశంలోని అన్నీపార్టీల అధినేతలతో సమావేశం నిర్వహించింది. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగానే కమిషన్ జమిలి ఎన్నికల నిర్వహణ కష్టమని రిపోర్టిచ్చింది. అయితే తర్వాత మళ్ళీ మోడీ అదే విషయాన్ని నొక్కిచెప్పటంతో కమిషన్ కూడా చేసేదిలేక జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమంటు ప్రకటించింది.

ఇప్పుడు విషయం ఏమిటంటే దేశంలో జమిలి ఎన్నికలు జరగాల్సిన అవరసరముందంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజుజు పార్లమెంటులో రెండు రోజులుగా ఒకటే ఊదరగొడుతున్నారు. దీనివల్ల వచ్చే లాభాలివి అంటు చాలానే చెబుతున్నారు. అయితే జమిలి ఎన్నికల వల్ల లాభాలు ఎన్నున్నాయో నష్టాలు, సమస్యలూ అన్నే ఉన్నాయి. అసలు జమిలి ఎన్నికలపై మోడీ ఎందుకింత పట్టుదలగా ఉన్నారు? ఎందుకంటే పార్లమెంటుతో పాటు దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోను బీజేపీ మాత్రమే అధికారంలో ఉండాలనేది మోడీ ఆలోచన.

దేశంలో అసలు ప్రతిపక్షాలన్నవే లేకుండా చేయాలని మోడీ ప్లాన్. ఇప్పుడు పార్లమెంటుకు, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మెజారిటి వస్తున్నా అన్నీ రాష్ట్రాల్లో గెలవటం లేదు. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే మరికొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు గెలుస్తున్నాయి. దీనివల్ల మోడీకి దేశంపై సంపూర్ణ ఆధిపత్యం రావటంలేదు.

పార్లమెంటుకు దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అప్పుడు జనాలు బీజేపీకి మాత్రమే ఓట్లేస్తారనేది మోడీ ఆలోచన. మధ్యలో ఏ రాష్ట్రంలో అయినా ముందస్తు ఎన్నికలకు సీఎంలు సిఫారసు చేస్తే ఏమవుతుందనే ప్రశ్నకు మోడీ దగ్గర జవాబులేదు. ఎందుకంటే 1967 వరకు మనదేశంలో జమిలి ఎన్నికలే జరిగాయి. అయితే 1968, 69లో కొన్ని రాష్ట్రాల్లో అప్పటి సీఎం అసెంబ్లీలను రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. అప్పటి నుండే జమిలి ఎన్నికలకు బ్రేకులు పడ్డాయి. రేపైనా ఇదే పరిస్ధితి వస్తే ఏం చేయాలనే ప్రశ్నకు కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర కూడా సమాధానం లేదు. కేవలం దేశంపై సంపూర్ణ ఆధిపత్యం కోసం మోడీ జమిలి జపం చేస్తున్నారంతే.

First Published:  16 Dec 2022 8:39 AM GMT
Next Story