Telugu Global
National

అప్పుల్లో తమిళనాడు నంబర్‌ -1

మొదటి స్థానంలో ఉన్న తమిళనాడు మొత్తం అప్పు 6.59 లక్షల కోట్లు. 6.53 లక్షల కోట్ల అప్పుతో ఉత్తరప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర అప్పు 6.08 లక్షల కోట్లు. అప్పుల్లో నాలుగో స్థానంలో ఉన్న బెంగాల్‌ 5.62 లక్షల కోట్లు అప్పు చేసింది.

అప్పుల్లో తమిళనాడు నంబర్‌ -1
X

ఏపీ అప్పు 2022 మార్చి నాటికి 3.98 లక్షల కోట్లని కేంద్రం ప్రకటించింది. లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌద‌రి ఈ విషయాన్ని వెల్లడించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల వివరాలను వెల్లడించారు. అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. ఏపీ ఎనిమిదో స్థానంలో ఉండగా.. తెలంగాణ 11వ స్థానంలో ఉంది.

మొదటి స్థానంలో ఉన్న తమిళనాడు మొత్తం అప్పు 6.59 లక్షల కోట్లు. 6.53 లక్షల కోట్ల అప్పుతో ఉత్తరప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర అప్పు 6.08 లక్షల కోట్లు. అప్పుల్లో నాలుగో స్థానంలో ఉన్న బెంగాల్‌ 5.62 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌ (4.77 లక్షల కోట్లు), కర్నాటక (4.61 లక్షల కోట్లు), గుజరాత్ (4.03 లక్షల కోట్లు)ఉన్నాయి.

ఏపీ అప్పు 2022 మార్చి నాటికి 3.98 లక్షల కోట్లు. తెలంగాణ అప్పు 3.12 లక్షల కోట్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. అయితే కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను ఈ జాబితాలో చేర్చలేదు.

First Published:  20 Dec 2022 2:36 AM GMT
Next Story