Telugu Global
National

మిగ్ ప్రమాదాలు మళ్లీ మళ్లీ.. ఈసారి ముగ్గురు బలి

ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు, అయినా ఫలితం లేదు. ప్రాణ నష్టాన్ని తప్పించేందుకు పైలట్ ప్రయత్నించినా సాధ్యం కాలేదని చెప్పారు.

మిగ్ ప్రమాదాలు మళ్లీ మళ్లీ.. ఈసారి ముగ్గురు బలి
X

ఎగిరే శవపేటికగా పేరున్న మిగ్-21 విమానం మరోసారి కుప్పకూలింది. ఈసారి పైలట్ సురక్షితంగా బయటపడగా అమాయకులైన ముగ్గురు పౌరులు దుర్మరణం పాలయ్యారు. రాజస్థాన్‌ లోని హనుమాన్‌ గఢ్‌ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదం మరోసారి మిగ్-21 పై తీవ్ర విమర్శలకు కారణమైంది.

ఈరోజు ఉదయం వాయుసేనకు చెందిన మిగ్‌-21 యుద్ధ విమానం రాజస్థాన్ లోని సూరత్‌ గఢ్‌ ఎయిర్‌ బేస్‌ నుంచి టేకాఫ్‌ అయింది. అయితే కాసేపటికే ఈ ఫైటర్‌ జెట్‌ లో సాంకేతిక లోపం తలెత్తింది. హనుమాన్‌ గఢ్‌ లోని డబ్లీ ప్రాంత వరకు రాగానే పైలట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. విమానాన్ని వదిలేసి పారాచూట్ సహాయంతో కిందకు దూకేశాడు. పైలట్ నియంత్రణ లేకపోవడంతో ఈ ఫైటర్ జెట్ విమానం కుప్పకూలింది. ఓ ఇంటిపై పడిపోయిది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు.

ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు, అయినా ఫలితం లేదు. ప్రాణ నష్టాన్ని తప్పించేందుకు పైలట్ ప్రయత్నించినా సాధ్యం కాలేదని చెప్పారు. విమానం గ్రామ శివారులో కుప్పకూలిందని, పైలట్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్పారు.

ఎప్పుడూ ప్రమాదాలే..

వాయుసేనకు చెందిన మిగ్‌ యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎగిరే శవపేటికలుగా ఈ రష్యన్‌ ఫైటర్‌ జెట్లకు పేరు పడిపోయింది. 1971 నుంచి ఇప్పటివరకు 400 మిగ్‌-21 ఫైటర్‌ జెట్లు కూలిపోయాయని చెబుతున్నారు. ఈ ప్రమాదాల్లో 200 మందికి పైగా పైలట్లు, దాదాపు 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులున్నాయి.

First Published:  8 May 2023 9:21 AM GMT
Next Story