Telugu Global
National

అన్నాడీఎంకేకు విశాల్ దగ్గరవుతున్నారా..? ఛాతిపై ఎంజీఆర్ టాటూ

వచ్చే ఎన్నికల్లో విశాల్ అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, అందుకే ఆయన ఆ పార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.

అన్నాడీఎంకేకు విశాల్ దగ్గరవుతున్నారా..? ఛాతిపై ఎంజీఆర్ టాటూ
X

తమిళ అగ్ర హీరోల్లో విశాల్ ఒకరు. విశాల్ పేరుకు సినిమాల్లో ఉన్నాడే గానీ ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. అందుకే సినిమా సంఘం అయిన నడిగర్ సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన సమయంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన అన్నా నగర్ కు ఉప ఎన్నిక వచ్చిన సమయంలో విశాల్ అక్కడి నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించారు. అయితే నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆ ఎన్నికల్లో విశాల్ పోటీ చేయలేకపోయారు.


అయితే అప్పటినుంచి విశాల్ తరచూ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని చెబుతూనే వస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా విశాల్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫొటోలో విశాల్ షర్టు లేకుండా ఛాతిపై ఎంజీఆర్ టాటూతో కనిపించారు. గతంలో విశాల్ పలుమార్లు తాను ఎంజీఆర్ కు పెద్ద అభిమానినని ప్రకటించారు. అయితే సందర్భం లేకుండా విశాల్ తన ఛాతిపై ఉన్న ఎంజీఆర్ టాటూను ఎందుకు చూపరన్నది ఆసక్తికరంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో విశాల్ అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని, అందుకే ఆయన ఆ పార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. మరికొందరు మాత్రం సినిమా షూటింగ్ లో భాగంగా ఎంజీఆర్ ను విశాల్ తన ఛాతిపై టాటూగా వేసుకోవలసి వచ్చిందేమోనని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా విశాల్ ఎంజీఆర్ పేరుతో ఉన్న టాటూను ప్రదర్శించి మరోసారి హాట్ టాపిక్ గా మారారు.

First Published:  24 Jan 2023 12:54 PM GMT
Next Story