Telugu Global
National

మాటిమాటికీ పుట్టింటికి వెళ్లిపోవడం భర్తను హింసించడమే.. - స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు

భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ, విశ్వాసం, ఆరాధన భావన ఉంటే వారి వైవాహిక బంధం అన్యోన్యతలతో వికసిస్తుందని జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది.

మాటిమాటికీ పుట్టింటికి వెళ్లిపోవడం భర్తను హింసించడమే.. - స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు
X

భర్త పొరపాటు ఏమీ లేనప్పటికీ భార్య పదేపదే పుట్టింటికి వెళ్లిపోతుంటే అది భర్తను మానసికంగా హింసించినట్టేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు.. అది క్రూరత్వ చర్యగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. భార్య హింస, క్రూరత్వ చర్యల కారణంగా విడివిడిగా ఉంటున్న దంపతులకు తాజాగా విడాకులు మంజూరు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ, విశ్వాసం, ఆరాధన భావన ఉంటే వారి వైవాహిక బంధం అన్యోన్యతలతో వికసిస్తుందని జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా తెలిపింది. సంయమనం కోల్పోయిన దంపతుల మధ్య ఎడబాటు పెరుగుతూపోతే వారు ఎన్నటికీ కలవలేనంతగా పరిస్థితి మారిపోతుందని న్యాయస్థానం తెలిపింది.

ఈ కేసులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న భర్త.. తమ 19 ఏళ్ల వైవాహిక జీవితంలో కనీసం ఏడుసార్లు తన భార్య తనను వీడి వెళ్లిపోయిందని న్యాయస్థానానికి వివరించారు. అలా వెళ్లిన ప్రతిసారీ పది నెలల పాటు ఆమె పుట్టింటిలో ఉందన్నారు. తొలుత సదరు భర్త కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఈ జంటకు విడాకులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భర్త హైకోర్టును ఆశ్రయించారు.

First Published:  6 April 2024 5:41 AM GMT
Next Story