Telugu Global
National

స్నేహితురాలితో లేచిపోయిన వివాహిత‌

ఇద్ద‌రూ క‌లిసి మాల్దా ప్రాంతంలోని ఓ హోట‌ల్‌లో గ‌ది అద్దెకు తీసుకుని ఉన్నారు. వారి తీరుపై అనుమానం వ‌చ్చిన హోట‌ల్ సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

స్నేహితురాలితో లేచిపోయిన వివాహిత‌
X

ఆమెకు పెళ్లయి నెల‌రోజులైంది. భ‌ర్తను కాద‌నుకుని.. త‌న స్నేహితురాలితో క‌లిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తామిద్ద‌రం ఒక‌రంటే మ‌రొక‌రు ఇష్ట‌ప‌డుతున్నామ‌ని, క‌లిసే ఉంటామ‌ని ఇప్పుడు వారిద్ద‌రూ తెగేసి చెబుతున్నారు. లేదంటే కోర్టుకెళ‌తామ‌ని చెబుతున్నారు. విచిత్ర‌మైన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

ప‌శ్చిమ‌బెంగాల్‌లోని అలీపూర్‌ద్వార్ జిల్లా ఫ‌ల‌కాటా ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి, కూచ్‌బిహార్ జిల్లాలోని తుఫాన్ గంజ్‌కి చెందిన మ‌రో యువ‌తికి కాలేజీలో ఉండ‌గా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది స్నేహంగా మారి.. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని స్థితికి చేరింది. వారి వ్య‌వ‌హారం ఇంట్లో తెలియ‌డంతో తుఫాన్‌గంజ్‌కు చెందిన యువ‌తి త‌ల్లిదండ్రులు హ‌డావుడిగా ఆమెకు సంబంధం చూసి నెల‌రోజుల క్రితం ఓ యువ‌కుడితో వివాహం చేశారు.

పెళ్ల‌యినా ఆమెకు త‌న‌ స్నేహితురాలు / ప్రేయ‌సిని వ‌దిలి ఉండ‌టం క‌ష్టంగా మారింది. గ‌త బుధ‌వారం ఆమె త‌న భ‌ర్త‌ను వ‌దిలి స్నేహితురాలు / ప్రేయ‌సితో క‌లిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇద్ద‌రూ క‌లిసి మాల్దా ప్రాంతంలోని ఓ హోట‌ల్‌లో గ‌ది అద్దెకు తీసుకుని ఉన్నారు. వారి తీరుపై అనుమానం వ‌చ్చిన హోట‌ల్ సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

తాము మేజ‌ర్ల‌మ‌ని, తాము ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డుతున్నామ‌ని, త‌మ త‌ల్లిదండ్రులు త‌మ సంబంధాన్ని అంగీక‌రిస్తే తిరిగి ఇంటికి వెళ‌తామ‌ని, లేదంటే కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని వారు తెగేసి చెప్పారు. దీంతో పోలీసులు వారి త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు. వారు వ‌చ్చాక.. ఈ విష‌యం ఎటు దారితీస్తుంద‌నేది వేచిచూడాలి.

First Published:  11 March 2023 6:03 AM GMT
Next Story