Telugu Global
National

విమానంలో మహిళ ముందే హస్త ప్రయోగం.. ప్రయాణికుడి నిర్వాకం

విమానం బయలుదేరిన కాసేపటికి ఆ మహిళ నిద్రలోకి జారుకుంది. పక్కనే కూర్చున్న యువకుడు అటు ఇటు కదులుతున్నట్లు అనిపించడంతో ఆమె కళ్తు తెరిచి చూసింది.

విమానంలో మహిళ ముందే హస్త ప్రయోగం.. ప్రయాణికుడి నిర్వాకం
X

ఇటీవల విమానాల్లో చిల్లర చేష్టలు అధికమయ్యాయి. సీట్ల కోసం కొట్టుకోవ‌డం, తాగిన మత్తులో విమానంలోనే మూత్ర విసర్జన చేస్తున్న వారి సంఖ్య ఇటీవల బాగా విప‌రీత‌మైంది. తాజాగా ఒక ప్రైవేట్ విమానంలో ఇంతకంటే దారుణమైన సంఘటన జరిగింది. మహిళ పక్కనే కూర్చున్న యువకుడు ఆమె చూస్తుండగానే హస్తప్రయోగం చేసుకున్నాడు. ఆమెను అసభ్యంగా తాకాడు. ఈ విషయమై బాధిత మహిళ విమానాశ్రయ సిబ్బందికి ఫిర్యాదు చేసింది.

కొంద్వా పట్టణానికి చెందిన ఫిరోజ్ షేక్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. కాగా అతడికి ఇటీవలే పెళ్లి నిశ్చయం అయ్యింది. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా అతడు విధుల నిమిత్తం పూణే నుంచి నాగపూర్‌కు ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో బయలుదేరాడు. అదే విమానంలో చంద్రాపూర్‌కు చెందిన 40 ఏళ్ల మహిళా టీచర్ పని నిమిత్తం నాగపూర్‌కు బయలుదేరింది. ఫిరోజ్ పక్కనే ఆమెకు సీటు కేటాయించారు.

కాగా విమానం బయలుదేరిన కాసేపటికి ఆ మహిళ నిద్రలోకి జారుకుంది. పక్కనే కూర్చున్న యువకుడు అటు ఇటు కదులుతున్నట్లు అనిపించడంతో ఆమె కళ్తు తెరిచి చూసింది. అతడి చేతి కదలికలను చూసి దురద వల్ల గోక్కుంటున్నాడని భావించి మళ్లీ నిద్రకు ఉపక్రమించింది. కానీ, ఫిరోజ్ కదలికల‌పై అనుమానం వచ్చి చూడగా.. యువకుడు త‌న‌ వైపే అసభ్యకరంగా చూస్తూ హస్త ప్రయోగం చేసుకుంటున్నట్లు గుర్తించింది.

దీంతో ఆ మహిళ పక్కకు తిరిగి కూర్చుంది. అయితే ఆ యువకుడు మహిళను మోచేతితో తడుముతూ సైగలు చేశాడు. ఇలా పలుమార్లు ఆమెను తాకుతూ తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాడు. విమానం నాగపూర్ కు వచ్చేంతవరకు యువకుడి వేధింపులను మహిళ ఓపికగా భరించింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ఫిరోజ్ వెనుక డోర్ నుంచి దిగి పారిపోయే ప్రయత్నం చేశాడు. బాధిత మహిళ అతడి వెంటపడుతూ గట్టిగా కేకలు వేయడంతో విమానాశ్రయంలోని సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె జరిగిన విషయాన్ని విమానాశ్రయ సిబ్బందికి వివరించింది. అధికారులు ఫిరోజ్‌ని స్థానిక పోలీసులకు అప్పగించారు.

First Published:  11 Oct 2023 11:18 AM GMT
Next Story