Telugu Global
National

సీడబ్ల్యూసీని పునరుద్దరించిన మల్లిఖార్జున్ ఖర్గే.. 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు

సీడబ్ల్యూసీలో కొత్తగా సచిన్ పైలెట్, శశిథరూర్, దీపా దాస్ మున్షి, సయ్యద్ నాసిర్ హుస్సేన్‌లకు చోటు దక్కింది.

సీడబ్ల్యూసీని పునరుద్దరించిన మల్లిఖార్జున్ ఖర్గే.. 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు
X

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆదివారం పునరుద్దరించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నేపథ్యంలో పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీని తిరిగి ఏర్పాటు చేస్తున్నట్లు మల్లిఖార్జున్ ఖర్గే వెల్లడించారు. సీడబ్ల్యూసీలో 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉన్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల వారికి కూడా సీడబ్ల్యూసీలో చోటు దక్కింది.

సీడబ్ల్యూసీలో కొత్తగా సచిన్ పైలెట్, శశిథరూర్, దీపా దాస్ మున్షి, సయ్యద్ నాసిర్ హుస్సేన్‌లకు చోటు దక్కింది. సచిన్ పైలెట్‌ను ఏదైనా పెద్ద రాష్ట్రానికి ఇంచార్జిని చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి.. మల్లిఖార్జున్ ఖర్గే చేతిలో ఓడిపోయిన శశి థరూర్‌కు సీడబ్ల్యూసీలో స్థానం కల్పించారు. ప్రియాంక గాంధీకి కూడా చోటు దక్కింది. ఆమెకు కూడా యూపీ కాకుండా మరో రాష్ట్రానికి చెందిన బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నది. కన్హయ్య కుమార్‌కు ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో సీడబ్ల్యూసీలో స్థానం కల్పించారు.

తెలంగాణ నుంచి దామోదర రాజనర్సింహా, కొప్పుల రాజుకు శాశ్వత ఆహ్వానితులుగా.. వంశీ చందర్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుడిగా చోటు కల్పించారు. ఇక ఏపీ నుంచి ఎన్.రఘువీరారెడ్డికి సీడబ్ల్యూసీలో చోటు దక్కింది. టి. సుబ్బిరామిరెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా, పల్లం రాజును ప్రత్యేక ఆహ్వానితుడిగా తీసుకున్నారు.

పూర్తి లిస్టు ఇదే..

సీడబ్ల్యూసీ సభ్యులు

1. మల్లిఖార్జున్ ఖర్గే

2. సోనియా గాంధీ

3. మన్మోహన్ సింగ్

4. రాహుల్ గాంధీ

5. అధిర్ రంజన్ చౌదరి

6. ఏకే ఆంటోనీ

7. అంబికా సోనీ

8. మీరా కుమార్

9. దిగ్విజయ్ సింగ్

10. పి.చిదంబరం

11. తారిఖ్ అన్వర్

12. లాల్ తన్హావాలా

13. ముకుల్ వాస్నిక్

14. ఆనంద్ శర్మ

15. అశోక్‌రావ్ చవాన్

16. అజయ్ మాకెన్

17. చరణ్‌జిత్ సింగ్ చన్నీ

18. ప్రియాంకా గాంధీ వాద్రా

19. కుమారి సెల్జా

20. గైఖంగమ్

21. ఎన్.రఘువీరారెడ్డి

22. శశీథరూర్

23. తమ్రాధ్వాజ్ సాహు

24. అభిషేక్ మను సింఘ్వీ

25. సల్మాన్ ఖుర్షీద్

26. జైరామ్ రమేశ్

27. జితేంద్ర సింగ్

28. రాజ్‌దీప్ సింగ్ సూర్జేవాలా

29. సచిన్ పైలట్

30. దీపక్ బబారియా

31. జగదీశ్ ఠాకూర్

32. జీఏ మీర్

33. అవినాశ్ పాండే

34. దీపా దాస్ మున్షీ

35. మహేంద్రజీత్ సింగ్ మాల్వియా

36. గౌరవ్ గగోయ్

37. సయ్యద్ నాసిర్ హుస్సేన్

38. కమలేశ్వర్ పటేల్

39. కేసీ. వేణుగోపాల్

శాశ్వత ఆహ్వానితులు

1. వీరప్ప మొయిలీ

2. హరీశ్ రావత్

3. పవన్ కుమార్ బన్సల్

4. మోహన్ ప్రకాశ్

5. రమేశ్ చెన్నితల

6. బీకే. హరిప్రసాద్

7. ప్రతిభా సింగ్

8. మనీశ్ తివారి

9. తారిఖ్ హమీద్ కర్రా

10. దీపేందర్ సింగ్ హుడా

11. గిరీశ్ రాయ చోడంకర్

12. టి. సుబ్బిరామిరెడ్డి

13. కొప్పుల రాజు

14. చంద్రకాంత్ హాండోర్

15. మీనాక్షి నటరాజన్

16. ఫూలో దేవి నేతమ్

17. దామోదర రాజనర్సింహా

18. సుదీప్ రాయ్ బర్మన్

ఇంచార్జీలు

19. డాక్టర్ ఏ. చెల్లకుమార్

20. భక్త చరణ్ దాస్

21. హరీశ్ చౌదరి

22. అజయ్ కుమార్

23. రాజీవ్ శుక్లా

24. మాణిక్యం ఠాకూర్

25. సుఖ్వింద్ రాంధావా

26. మాణిక్‌రావ్ ఠాక్రే

27. రజనీ పటేల్

28. కన్హయ్య కుమార్

29. గురుదీప్ సప్పాల్

30. సచిన్ రావు

31. దేవేందర్ యాదవ్

32. మనీశ్ ఛత్రా

ప్రత్యేక ఆహ్వానితులు

1. పల్లం రాజు

2. పవన్ ఖేరా

3. గణేష్ కొడియాల్

4. కొడిక్కునిల్ సురేశ్

5. యశోమతి ఠాకూర్

6. సుప్రియా శ్రీనాథే

7. ప్రినితి షిండే

8. ఆల్కా లాంబా

9. వంశీచంద్ రెడ్డి

ఎక్స్‌అఫీషియో సభ్యులు

10. బీవీ శ్రీనివాస్ - ఐవైసీ అధ్యక్షుడు

11. నీరజ్ కుందన్ - ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు

12. నేట్టా డిసౌజా - అధ్యక్షురాలు మహిళా కాంగ్రెస్

13. లాజీ దేశాయ్ - చీఫ్ ఆర్గనైజర్ సేవాదళ్

First Published:  20 Aug 2023 9:42 AM GMT
Next Story