Telugu Global
National

మాలేగాం పేలుళ్ల కేసులో ప్రజ్ఞాఠాకూర్ పాత్ర...వెల్లడించిన ఫోరెన్సిక్ నిపుణులు

మాలేగావ్ బాంబు పేలుళ్ళ‌ కేసులో బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పాత్ర ఉన్నట్టు తేటతెల్లమైంది. మసీదు వద్ద స్కూటర్ బాంబు పేల్చి ఆరుగురు వ్యక్తుల మరణానికి 100 మంది గాయాలపాలవ్వడానికి ఆమెకు లింక్ ఉన్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు బైటపెట్టారు.

Pragya Singh Thakur
X

ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌

2008 మాలేగావ్ పేలుడు కేసులో భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు లింక్ ఉన్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు బైటపెట్టారు. పేలుడుకు ఎల్‌ఎమ్‌ఎల్ వెస్పా స్కూటర్ ను వినియోగించారని ఫోరెన్సిక్ బృందం కోర్టుకు తెలిపింది. స్కూటర్ లో పెట్టిన బాంబు పేలడంతో ఆరుగురు వ్యక్తులు మరణించగా 100 మంది గాయపడ్డారు

పేలుడుకు ఉపయోగించిన ఎల్‌ఎమ్‌ఎల్ వెస్పా స్కూటర్ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పేరు మీదనే రిజిస్టర్ అయి ఉందని ఫోరెన్సిక్ నిపుణులు ముంబయిలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు

సెప్టెంబరు 29, 2008న నాసిక్ జిల్లాలోని మాలెగావ్ పట్టణంలోని మసీదు సమీపంలో స్కూటర్ లో పెట్టిన బాంబు పేలడంతో ఆరుగురు వ్యక్తులు మరణించగా 100 మంది గాయపడ్డారు.

ప్రగ్యాసింగ్ ఠాకూర్ కు చెందిన స్కూటరులో అమ్మోనియం నైట్రేట్ ను రికవరీ చేశామని ఫోరెన్సిక్ నిపుణులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. తాము జరిపిన కెమికల్ పరీక్షల్లో అమ్మోనియం నైట్రేట్ ను పేలుడుకు ఉపయోగించారని తేలిందని, సాక్షులు కూడా అదే విషయం చెప్పారని 2008లో అసిస్టెంట్ కెమికల్ ఎనలైజర్‌గా పనిచేసిన ఫోరెన్సిక్ నిపుణుడు తేల్చిచెప్పారు.

తాను 2008లో పేలుడు జరిగిన ప్రదేశానికి వెళ్లినప్పుడు LML వెస్పా స్కూటర్ తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో కనిపించిందని ఫోరెన్సిక్ నిపుణుడు కోర్టుకు తెలిపారు. స్కూటర్ ఇంధన ట్యాంక్, సీట్ కవర్ ఊడిపోయి, విడి భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హోండా యునికార్న్, సైకిల్ సహా ఇతర వాహనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. అనిచెప్పారాయన‌

ఇప్పుడు పదవీ విరమణ పొందిన ఈ ఫోరెన్సిక్ నిపుణుడు ఆరోజు తన దృష్టికి వచ్చిన అంశాలన్నింటిని కోర్టు ముందు ఉంచారు.

స్కూటర్ ఇంజన్ మీద నంబర్ ను చెరిపేశారని, ఓ రసాయ‌న ప్రక్రియ ద్వారా బైక్‌లోని మూడు ఇంజన్ నంబర్‌లను గుర్తించగలిగానని ఫోరెన్సిక్ నిపుణుడు ఎన్ ఐ ఏ కోర్టుకు చెప్పారు.

కాగా మాలేగావ్ పేలుళ్ళ కేసులో నిందితురాలైన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఆరోగ్యకారణాలు చూపించి బెయిల్ పై విడుదలయ్యారు. ఆ పై బీజేపీ తరపున భోపాల్ నుంచి ఎంపీగా గెలిచారు.

First Published:  3 Aug 2022 8:46 AM GMT
Next Story