Telugu Global
National

కారు రివర్స్ చేస్తూ లోయలో పడి యువతి మృతి, వీడియో వైరల్

కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లోయలో పడి యువతి మృతి చెందిన విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది.

కారు రివర్స్ చేస్తూ లోయలో పడి యువతి మృతి, వీడియో వైరల్
X

కారు రివర్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లోయలో పడి యువతి మృతి చెందిన విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది. డ్రైవింగ్ రాకపోయినా.. కారుని రివర్స్ చేసే ప్రయత్నంలో శ్వేత అనే యువతి ప్రాణాలు పొగొట్టుకుంది. శూలీభంజన్ కొండపై జరిగిన ఈ ఘటనలో యువతి వాహనంతో సహా 300 అడుగుల లోయలో పడింది. అక్కడికక్కడే మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

23 ఏళ్ల శ్వేత దీపక్ అనే యువతి తన స్నేహితుడితో కలిసి ఔరంగాబాద్ నుంచి సులిబంజన్ హిల్స్ కు టూర్ కు వచ్చింది. డ్రైవింగ్ సీటులో కూర్చుని కారు నడిపే ప్రయత్నం చేసింది. శ్వేత కారును రివర్స్ చేస్తుండగా.. సూరజ్ వీడియో రికార్డు చేస్తున్నాడు. కారు కాస్త వేగంగా వెనక్కి వెళ్తుండడాన్ని గమనించిన ఆమె స్నేహితుడు వెంటనే పరుగున క్లచ్‌పై కాలు వేయమని శ్వేతకు సూచించాడు. కానీ అది ఆమె అర్ధం చేసుకొని స్పందించే లోపే ఘొరం జరిగిపోయింది.

శ్వేత వాహనంతో సహా 300 అడుగుల లోయలో పడింది. శ్వేత కారు నడుపుతుండగా సూరజ్రి కార్డ్ చేసిన వీడియో లో కారు వేగం పెరగడటం, సూరజ్ క్లచ్ వేయమని చెప్పటం అన్ని రికార్డ్ అయ్యాయి. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. కారు వేగం పెరగడంతో పరిస్థితి అర్థమైన సూరజ్.. శ్వేతను రక్షించేందుకు యత్నించినప్పటికీ అప్పటికే కారు లోయలో పడినట్టు పోలీసులు వివరించారు. కొండ పైనుంచి 300 అడుగుల లోయలోకి పడిపోవడంతో కారు నుజ్జునుజ్జు అయిపోయింది. యువతిని హెచ్చరించినా.. కంగారులో ఏమీ చేయలేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు సైతం చెబుతున్నారు.

నిజానికి కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. నైపుణ్యం ఉన్న డ్రైవర్లే అప్రమత్తంగా ఉండాల్సిన ఇలాంటి ప్రాంతాల్లో సరదా కోసమో, రీల్స్ కోసమో ఇలాంటి పనులు చేసి ప్రాణాలమీదకి తెచ్చుకోవడం సరికాదంటూ నెటిజన్లు ఈ వీడియో పై స్పందించారు.


First Published:  18 Jun 2024 4:46 PM GMT
Next Story