మద్రాస్ హైకోర్టు జడ్జిగా మహాకవి శ్రీశ్రీ కుమార్తె
జస్టిస్ నిడుమోలు మాలా ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. గత ఏడాది మార్చిలో ఆమె మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
BY Telugu Global13 Sep 2023 2:12 AM GMT

X
Telugu Global13 Sep 2023 2:12 AM GMT
మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాస రావు) కుమార్తె జస్టిస్ నిడుమోలు మాలా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ నిడుమోలు మాలా ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. గత ఏడాది మార్చిలో ఆమె మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
అదే కోర్టులో జస్టిస్ మాలాతో పాటు ఏఏ నక్కీరన్, ఎస్ సుందర్, సుందర్ మోహన్, కబాలి కుమారేశబాబు అదనపు న్యాయమూర్తులుగా ఉన్నారు. తాజాగా వారిని కేంద్ర న్యాయ శాఖ వారిని కూడా అదే న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా నియమించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story